ఎండమావుల నడుమ పూదోట

శనివారం సాయంత్రం..
బార్ లో జనం కొంచెం ఎక్కువగానే ఉన్నారు.
ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒంటరిగా, మౌనంగా కుర్చుని ఉన్నాడు రఘు. ఎదురుగా ఉన్నా విస్కీ పోసిన గ్లాసు వంక తదేకంగా చూస్తున్నాడు. గ్లాసులో ఉన్నా ఐస్ క్యూబ్ గిర గిరా తిరుగుతుంది, సరిగ్గా తన మనసులో ఆలోచనల సునామి లాగా.
చుట్టూ పక్కల జరుగుతున్నవి ఏవీ తనకి సంబంధం లేనట్టు, ఈ ప్రపంచంలో తను ఒక్కడే మిగిలిపోయినట్టు, జీవితం ఇక్కడే ఆగిపోయినట్టు.. నిస్తేజంగా ఉన్నాయి అతని కళ్ళు.

"హాయ్ రా" ఎవరో పిలిచినట్టు ఉంటే తలపైకెత్తి చూసాడు రఘు.
'ప్రశాంత్' , తన చిన్న నాటి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ప్రతి సంతోషం లోను ప్రతి బాధలోనూ పాలు పంచుకున్న వ్యక్తి.
"ఏంట్రా... ఉన్నట్టుండి రామ్మన్నావ్?" రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ప్రశాంత్.
రఘు మౌనంగానే ఉన్నాడు. ఇంతలో బేరర్ వచ్చి ప్రశాంత్ కి కూడా ఒక విస్కీ గ్లాసు పెట్టి వెళ్ళాడు.
అయిదు నిమిషాలు మౌనంగానే గడిచిపోయాయి.. ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది. రఘు జీవితంలో ఏదో ఊహించనిదే జరిగింది.

మళ్ళి కదిలించడానికి ప్రయత్నించాడు ప్రశాంత్..
"ఏమయింది రా? ఏదయినా సమస్యా?"
తల పైకేతి ప్రశాంత్ వైపు చూసాడు రఘు..
రఘు కళ్ళలో పలచటి కన్నీటి తెర. గద్గద స్వరంతో ఒక్కో మాట కూడబలుక్కుంటూ అన్నాడు.."అంతా అయిపోయిందిరా, ఇంకేం మిగల్లేదు నా జీవితానికి"

రఘుని అలా చూడగానే కలవార పడిపోయాడు ప్రశాంత్. వెంటనే లేచి రఘు పక్కగా వచ్చి కూర్చుని, అతని బుజం మీద చేయి వేసి
"ఏమయింది రా? నాతో చెప్పరా.." బుజ్జగిస్తూ అడిగాడు ప్రశాంత్.
"వచ్చే నెల తన పెళ్లి" తల వంచుకుని చెప్పాడు రఘు.
"అదేంట్రా తను ఇంట్లో చెప్తానంది గా?" విస్మయంగా అడిగాడు ప్రశాంత్.
"చెప్పింది. వోప్పుకోలేదురా వాళ్ళు. కులం పట్టింపు ఎక్కువారా వాళ్ళ నాన్నకి. ససేమీరా అన్నారు."
"మరి తనేమంది?"
"తనేం చేయలేదురా.. వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా తను ఏమి చేయలేదు. ఒక వేళ ఏమయినా చేసినా.. తరవాత వాళ్ళ నాన్నని ఊర్లో అందరు చులకనగా చూస్తూ, అవహేలనగా మాట్లాడితే తను బరించలేను అంటుంది. తనను ఎంతో ప్రేమగా చూసే తండ్రి, తన వలన అందరి చేత మాట పడటం తను బరించలేను అంటుంది. కాని తను కూడా చాల ఏడుస్తుంది రా.."

"అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయిందన్నమాట"

"అవును, ఇంక చేసేది ఏమీ లేదు. కాని తను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా రా.. ఏ పని చేస్తున్న తనే గుర్తొస్తుంది, గుండెలు పిండేసినట్టు ఉంటుందిరా. ఈ భాద బరించేకంటే చావడం మేలనిపిస్తుంది. అసలు తనని ఇంకో వ్యక్తీతో ఊహించుకోలేకపోతున్న రా" పూర్తిగా కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రఘు.

ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది.

"రఘు నీ పరిస్తితి అర్ధం చేసుకోగలను.. బాధపడకు. కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయి. కొంచెం నిబాయించుకో.."
"నా వల్ల కావడంలేదురా... నాకు ఇంకేమి జీవితం కనపడటం లేదు"
"అందుకని ఇలా రోజు తాగి, ఏడుస్తూ తాగుబోతులా తయారవుతావా..?"
"నీకేం తెలుస్తుందిరా.. నా బాధ.. అనుభవిస్తే తెలుస్తుంది.." ఉక్రోషంగా అన్నాడు రఘు.
"అరేయ్.. ఒక్క మాట అడుగుతాను చెప్పు.. తన పరిస్థితి ఏంటో ఆలోచించావా?"

ప్రస్నార్దాకంగా చూసాడు రఘు.
"నీకు బాధగా ఉంటే.. స్నేహితులందరికీ చెప్పుకుంటావు. ఇలా బార్ కి వచ్చి తాగుతావు. ఆ తరవాత మత్తులో ఒళ్ళు మీద తెలియకుండా పోడుకుంటావు. మరి తనేం చేస్తుందిరా? తనకి కూడా బాద ఉంటుంది గా?"
రఘు ప్రశాంత్ వంక భావరహితంగా చూసాడు..

"అవును రా.. తను నీకు లాగా అందరికి చెప్పుకోగాలాదా? నీకు లాగా తాగి పడిపోగాలదా? తనలో తానూ కుమిలిపోవల్సిందేగా..
పైగా ఇలా తాగి జీవితాన్ని పాడు చేసుకుంటున్న నిన్ను చూసి.. తను ఇంకా నరకం అనుబవించాలిగా.. ఇది ఎప్పుడయినా ఆలోచించావా నువ్వు?"
నిజమే.. ప్రశాంత్ చెప్తున్న కోణంలో తను ఎప్పుడు ఆలోచించనేలేదు..
రఘు నిశ్సబ్దంగా ప్రశాంత్ మాటలు వింటూ ఉండిపోయాడు.

"రఘు, చేతిలో చేయడానికి ఏమి లేనప్పుడు. నువ్వు బాదపడుతూ.. తనని కూడా ఎందుకు క్షోభకు గురిచేయాలి?"
ప్రశాంత్, రఘు బుజం మీద చేయివేసి చెప్తూ ఉన్నాడు..

"ప్రేమ ఎప్పుడు ఎదుటి వారి సంతోషాన్ని మాత్రమె కోరుకుంటుంది.. అలా కోరుకోవాలి అదే నిజామయిన ప్రేమ. అన్ని అనుకూలించినప్పుడు ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన సంతోషాన్ని నువ్వు కాంక్షించాలి. చెప్పడం తేలికే.. కాని ప్రయత్నించు. తనకి సంతోషంగా కనపడు. నువ్వు నార్మల్ అవ్వగలవని తనకి అనిపించేటట్టు చెయ్యి. పనిలో ఏకాగ్రత పెట్టు. కొంత కాలం ఆగి చూడు. అన్ని సర్దుకుంటాయి. తన జీవితం బాగుండాలి అని కోరుకో."
ప్రశాంత్ మాటలు వింటున్న రఘు ప్రశాంత్ మీద వాలి పోయి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.

"ఒకటి గుర్తు పెట్టుకోరా రఘు, గుండెలు పిండే బాద ఉన్నా.. ప్రేమించిన వారి కళ్ళలో సంతోషాన్ని చూడలనుకోడమే.. ప్రేమ"

ఆకరి బొట్టు వరకు ఏడ్చాడు రఘు. కాని ప్రశాంత్ మాటలు అతన్ని ఆలోచింపచేసాయి. మనసులోనే అనుకున్నాడు..

"ఎండమావుల నడుమ పూదోట పూయిస్తాను... నీ అందమయిన జీవితానికి కానుకగా"

ఇది ఏ ఊరొ చెప్పగలరా?

వీరి వీరి గుమ్మడి పండు.. ఊరు పేరు ఏమి?


           ఏదో పల్లెటూరు అనుకుంటున్నారా? కాదు. పోనీ ఒక మామూలు చిన్న సైజు టౌను అనుకుంటున్నారా.. అసలు కాదు.
ఇది దేశంలోని మహా నగరాలలో ఒక పేరు మోసిన నగరం. సోది ఆపితే ... బెంగుళూరు సిటి. కొన్ని విషయాలలో బెంగుళూరుకు మంచి పేరు ఉంది. Planned City అని, రోడ్లు గట్ర బాగుంటాయని అంటుంటారు. మరి ఈ ఎలక్ట్రసిటి వాళ్ళకి ఏమి మాయరోగమో అర్ధం కాదు.. ఈ ఏరియాలో ఎక్కడ చూసిన ఇంతే.. చేతి కందే ఎతులో ఇలా వాయిర్లు వేలాడుతూ ఉంటాయి.. బ్రాకెట్లో కరంటుతో..
ఈ ఫోటో లో చూపించింది ఒకటే కాదు. ఇక్కడ ఎక్కడ చూసిన ఇదే బాపతు. సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ చేయి పైకి ఎత్తారనుకోండి. యమ స్పీడుగా యముడ్ని చేరుకోవచ్చు. సిటి అవుట్ స్కర్ట్స్ అని నిర్లక్స్యమో.. లేక మరేమిటో నాకు తెల్వద్
అదీ కాదండి.. సిటి అవుట్ స్కర్ట్స్ లో ఉండేవాళ్ళు మనుషులు కార? ఆహా.. కారా అని ప్రశ్నిస్తున్నాను. మీరు పీల్చిన గాలినే మేమూ పీలుస్తున్నమండి. మీరు తినే పీజాలు బర్గార్లనే మేమూ తింటున్నాము.. (అంటే వేరేవి ఎంగిలివి కాదు). 

         ఈ పక్షపాత ధోరణిని తీవ్రంగా.. ఖండ ఖండాలు గా ఖండిస్తూ .. సెలవు తీసుకుంటున్నాను..
                                                                      జై హింద్..

అందరు సుఖపడాలి నంద నందనా...

సమయం ఒంటిగంట దాటింది...
అలవాటు ప్రకారం కడుపులో రాట్ రేస్ మొదలయింది. చేసిన పని చాలు అనుకుని కీబోర్డ్ మీద WINDOWS + L కొట్టి లంచ్ కి ఉపక్రమించాను. అలా నడుచుకుంటూ డౌన్ ఫ్లోర్ లో ఉన్నా Cafeteria కి వెళ్లాను. ఫుల్ రష్ గా ఉంది. ఇంతలో మా కలిగ్ కనిపించి ఇద్దరికీ నాన్ మరియు ఆలు గోబీ ఆర్డర్ చేసింది. కాసేపటి ఎదురు చూపులు తరవాత రెండు ప్లేట్లు వచ్చాయి. ఇక అలా ఒక టేబుల్ చూసుకుని, పిచ్చా పాటి మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టాం.
           ఆలు గోబీ చేసినవాడికి బ్లడ్ ప్రషర్ సమస్య ఉన్నట్టు ఉంది, బొత్తిగా ఉప్పు కారం వేయలేదు. తప్పదు అన్నట్టు అలా తినడం మొదలుపెట్టాను. నా మొహం చూసి మా కలిగ్ అడిగింది..  "How is it?" అని. "Yaa Yaa... Good Good." అన్నాను ఇకిలించుకుంటూ. మొహామాటం కదా.. నచ్చలేదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు. అలా నాన్ రెండు ముక్కలు తిన్నాక..  నాన్ యొక్క భౌతిక స్థితి లో ఏదో మార్పు వచినట్టుంది. రెండు వేళ్ళతో త్రుంచడం అవ్వడం లేదు. సరే రెండో చెయ్యి కూడా పెట్టి త్రుంచి నోట్లో పెట్టుకున్నా. హావాయ్ చెప్పు ముక్క ఏదో నోట్లో పెట్టుకుని నవిలినట్టు అనిపించింది. ఈ రకంగా ఒక్కో ముక్క క్రష్ చేయడానికి నానా అవస్థా పడాల్సోస్తుంది. తిండి తినడానికి ఇన్ని కష్టాల? అవసరమా అనిపించింది..
        సో మిగతాది అలాగే వదిలేసా.. "Hey! Whaaat Haappen?" అంది మా కలిగ్. "Yaa! its OK. I am not much hungry" అని మళ్ళి ఇకిలించాను. అసంతృప్తిగా ముగిసిన లంచ్ బ్రేక్ తో మళ్ళి నా డెస్క్ చేరుకున్నా. 'డబ్బు పోయే శని పట్టే' అంటే ఇదేనేమో. ఈ సమస్య నాకేనా లేక అందరికినా? నాకు తెలిదు.

        సాయంత్రం ఇంటికి వెళ్తూ ఎమన్నా చిరుతిండి తిందామని రోడ్డు పక్కన ఆగాను (ఎప్పుడు తిండి గోలేనా వీడికి అనుకోకండి). చుట్టూ పరికించి చూస్తె ఒకావిడ బండి మీద మిరపకాయ బజ్జీలు వేస్తూ కనిపించింది. వేడి వేడి బజ్జీలు చూడగానే లోపల ఉన్నా ఆత్మా రాముడు గట్టిగా విజిల్ వేసాడు.
         ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే ఆలు బజ్జి ఒక ప్లేట్ ఆర్డర్ చేశా. ఆ తరవాత బజ్జి, ఆ తరవాత మిరపకాయ బజ్జి, తరవాత ఒక ఎగ్గు బజ్జి. భయంకరంగా తిన్నాక ఎంతయింది అని అడిగాను. ముప్పయి రూపాయలు అన్నది ఆవిడ. అంతేనా? అప్పుడు ఆవిడ వంక చూసాను. కొంచెం పెద్దావిడే. నలబై ఉండవచ్చు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు నుంచి మొదలవుతుంది వీళ్ళ వ్యాపారం. బాగా ఎండగా ఉంది. కాని ఆవిడలో అలాంటి విసుగు, అలసట ఏమి కనిపించడం లేదు. ఎంత వోపిక ఆవిడకి?

      ఆవిడ ఒక్కతే కాదు. ఆ రోడ్డు లో చాల మంది నడి వయసు స్త్రీలు ఇదే చేస్తుంటారు. మన భారతీయ స్త్రీలకు ఇంట్లో ఉండే భాద్యతలు ఏమిటో అందరికి తెలుసు. అవన్నీ నిర్వర్తిన్చుకుని ఈ పని కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తారు? ఈ సంపాదనతో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించ గలుగుతారా? సగటు మనిషి అనుభవించే అన్ని సౌకర్యాలు అనుభవించ గలుగుతారా? వాళ్ళ తరవాతి తరం వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమయినా అభివృద్ధి చూడగాలుగుతారా?

          అసలు ఇదే నా మెయిన్ బ్లాగ్ టాపిక్. ఆవిడ ఇంటి అవసరాల కోసం ఎంత dedication చూపిస్తుంది. ofcourse అది అవసరం వలన వచ్చిన dedicatin కావచ్చు. కాని అలా కష్టపడే వారిని encourage చెయ్యాలి అని నాకనిపించింది. మనలో చాల మందికి ఏదో ఒక చారిటి Activity లో పాలుపంచుకోవాలని ఉంటుంది. ఇలాటి చిన్న వ్యాపారస్తులకి బిజినెస్ ఇవ్వడం కూడా నా ద్రుష్టి లో వారికి సహాయం పడటమే. కొంత మంది ఉంటారు, కూరగాయల బండి వాడి దగ్గర రూపాయ్ రూపాయ్ కి బేరం ఆడుతుంటారు. కాని సూపర్ బజార్ కి వెళ్లి వాడు ఎంత ఖరీదు చెప్పినా కిక్కురు మనకుండా ఇచ్చి వస్తారు.

            కష్టపడే వారు ఎవరైనా వారికి ఎదిగే హక్కు ఉంది. ఎదగాలని తాపత్రయ పడే వారికి చేయూత నివ్వడం కూడా మన బాధ్యత. కూరగాయల బండి నడిపే వ్యక్తీ కొడుకు కూడా అదే బండి నడపకూడదు.


            మనం వింటుంటాం Developed Countries , Developing Countries అని ఉంటాయి. India ఒక Developing Country. ఎన్నో సంవత్సరాలుగా Developing Country గానే ఉంది. అన్ని వర్గాల ఆర్ధిక ప్రమాణాలు సంతృప్తి కరంగా మారిన రోజున మనది కూడా Developed Country అవుతుంది (నాకు తెలిసిన ఎకనామిక్స్ ఇంతే). కాబట్టి చిన్న చిన్న వ్యాపారస్తులను ఆదుకుందాం. ఎందుకంటే....

"అందరు సుఖపడాలి నంద నందనా"

ప్రేమలో ఉండగా మరొకరు ఆకర్షిస్తే..

మనిషికి ఎన్నో కోరికలు..
తనకేం కావాలో తనకే తెలియదు.. దక్కినవి నచ్చవు, దక్కనివాటి కోసం ఆరాటం ఆగదు.
ఈ మానసిక అసమతుల్యంలో.. అతని చర్యలేమిటో అతనికే అంతుచిక్కదు...
తొందరపాటు తనంలో తీసుకునే నిర్ణయాలకి భావిష్యతులో మూల్యం చెల్లించవలసి వస్తుంది.




ఈ రోజు విన్న ఒక సంఘటన.. ఈ పుట రాసేలా చేసింది నన్ను.
ప్రేమలో ఉండగా మనసు మరో వైపు మల్లుతుందా?
అవును, కొన్ని సందర్బాలలో జరుగుతుంది. అది కూడా చాల సహజంగా. తప్పు అని కూడా చెప్పలేని విధంగా..


ఉదాహరణకు... కాలేజి రోజుల్లో ప్రేమలు ఎక్కువగా అందానికి, ఆకర్షణకు కొన్ని కొన్ని సార్లు ఏ కారణం లేకుండా కూడా మొదలవడం మనం చూస్తుంటాం. ఈ రోజుల్లో ఇవి మరీ ఎక్కువ కదా?


అయితే.. ఎప్పుడయితే మనిషిలో (ఆడ అయినా మగ అయినా) మెచ్చ్యురిటి లేదా మెరుగయిన ఆలోచనా విధానం మొదలువుతుందో, అప్పుడు తన ఆలోచనలు పూర్తీగ మారడం జరగోచ్చు.  అప్పుడు తన జీవిత బాగస్వామి పట్ల తనకి ఉన్నా Requirements మొత్తం కొత్తవి రావొచ్చు.


ఒకప్పుడు రఫ్ గా ఉండి అందరిని బయపెట్టే మనిషి పట్ల crazy గా అనిపించిన అమ్మాయికి, పరిణితి వచ్చాక.. మృధుస్వభావి, వినయవిదేతలు కలిగిన మనిషితో జీవితం ఆహ్లాదంగా ఉంటుంది అనే ఆలోచనా వస్తే..?


ఒకప్పుడు.. అందంగా గర్వంగా ఉండే అమ్మాయిని సత్యభామ తో పోల్చుకుని మురిసిపోతే.. ఉద్యోగంలో చేరి నిజ జీవితపు ఒడి దుడుకులు చూసాక, తనని అర్ధం చేసుకుని కష్ట సుఖాలలో కాస్త ఊరటగా ఉండే అమ్మాయి.. నలుగురికి మంచి చేసే అమ్మాయి పట్ల ఆరాధన భావం పెంచుకుంటే.. మొదటి అమ్మాయితో జీవితం దుర్బరం అవుతుంది అన్న నిర్ణయానికి వస్తే?


ఎం చేయాలి?


సహజంగా ఎం చేస్తుంటారు?
కొంతమంది తప్పదు తల రాత అని కంటిన్యు అయిపోతారు..
కొందరు ఎలా చెప్పాలో తెలియక మెల్లగా మాట్లాడటం తగ్గిస్తారు. కాని అవతల వారికి ఎం జరిగిందో అర్ధం కాక పిచ్చి ఎక్కుతుంటుంది.
కొందరు ఏ నిర్ణయం తీసుకోరు.. రెండు relations ఒకేసారి నడిపిస్తుంటారు. ఇది చాల ప్రమాదం, ఈ కేసు లో చివరికి ఏ మంచి జరగదు.
ఇక పోతే మరికొందరు.. ఎవరో ఒకరిని స్నేహితులుగా మార్చుకుంటారు.


పైన చెప్పిన వాటిలో మీరు దేన్నీ సమర్దిస్తారు?
సరే అది పక్కన పెడదాం..


ఇదే విషయాన్ని మరొక కోణంలో చూద్దాం.
ప్రేమించిన వ్యక్తి మరొకరితో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసినప్పుడు ఎం చేయాలి?


కొందరు పిచ్చికోపంతో ఊగిపోతారు.. మరి కొందరు మగవారు ఉన్మాదిలాగా మారి రాక్షసత్వం చూపిస్తారు.
కొందరు జీవితం మొత్తం కోల్పోయామనే భావనతో total గా డిప్రేస్స్ అయిపోయి తాగుబోతులు అవుతుంటారు.
కొందరు కుమిలి కుమిలి ఏడ్చి కొన్నాళ్ళకు మాములుగా అవుతారు.
కొందరు బలహీనమయిన మనస్తత్వం కలవారు జీవితాన్ని అంతం చేసుకుంటారు. (ఇది అతి పెద్ద మూర్కపు పని)


దీనిలో మీరు దేనిని సమర్దిస్తారు?


సరే నేను విన్న సంఘటన దగ్గరకు వస్తే..
ఒక అమ్మాయి రెండో వ్యక్తి ని ఇష్టపడి, ఇద్దరితో సమానంగా ఉండటం జరిగింది..
ఆ తర్వాత ఈ ఇద్దరు కుర్రాళ్ళు గొడవపడటం వలన మొదటి వ్యక్తీ ప్రాణాలు కోల్పోయారు.




ఇక్కడ ఎవరిది తప్పు?
కచ్చితంగా మీరు వోప్పుకుంటారు. అమ్మాయిది అని.
కాని ఆ అమ్మాయి ఎం చేసి ఉండాల్సింది. మొదటి వ్యక్తి కి అర్ధమయ్యేలా చెప్పాల్సింది. అది అంత సులువు కాదు. కొంచెం కష్టమే.. కాని ప్రాణాలు పోయే అంత కష్టం మాత్రం కాదు కదా? ఒక మాట చెప్పేసి ఉంటే ఎలా ఉండేది? కాని తను బయపడి ఉంటుంది.
ఒక వేళ చెప్తే.. తను పాజిటివ్ గా తీసుకుంటాడో లేదో అని అలోచించి ఉండొచ్చు. కాని ఈ కన్ఫ్యూజన్ ఖరీదు ఒక ప్రాణం.






మరేం చేయాలి?
మనసు విప్పి మాట్లాడుకోడమే మిగిలి ఉన్నా ఒకే ఒక మార్గం.
అర్ధమయ్యేలా చెప్పి, అతను లేక ఆమె అంగీకారం తీసుకోడం చాల అవసరం. రెండో వ్యక్తీకి ని కూడా ఇందులో involove చేయడం మంచిది. ఒక మంచి understanding తో స్నేహుతులుగా మారే అవకాసం ఉంటుంది.






అలా చెప్పినప్పుడు అంగీకరించే సహృదయం రెండో వ్యక్తీ (విడిపోయే వ్యక్తి) ఉండాలి. కాలం మారుతుంది. కాలంతో పాటు ఆలోచనలు, భావాలు మారాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేమించడం అంటే.. వారి క్షేమం కోరోకోడమే..  వారు సంతోషం గా లేకుండా కలిసి ఉంటే.. అది ఒక మంచి సంబంధం అనిపించుకోదు. అయినా ఒకసారి వారి మనసు మారిన తరువాత తిరిగి మార్చాలనుకోడం అంత సబబు కాదు.




చివరిగా ఒక మాట. ఒకరిని భ్రమలో ఉంచి, మరొకరితో advance అవడం మాత్రం చాలా చాలా పెద్ద పొరపాటు. ఏదయినా Frank  గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా, నిజాన్ని నిర్బయంగా చెప్పాలి. "ప్రేమ జీవితాలని నిలుపుతుంది. మరో కోణంలో జీవితాలతో ఆడుకుంటుంది. జీవితాలను అంతం చేస్తుంది."




ఇప్పుడు ఇదంతా చదివి అందరు ప్రభావితం అయిపోయి.. పార్టీలు మార్చేయాలని కాదు. ఒక్కోసారి అది పెద్ద పొరపాటు కూడా అవుతుంది. ప్రేమించిన వారిని వదిలేసి తప్పుడు త్రోవలో పడటం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదయినా బాగా అలోచించి నిర్ణయం తీసుకోడం అవసరం.


"నిజమయిన ప్రేమను త్రుంచాలనుకోడం మూర్కత్వం."

మనసుకి హత్తుకునే చిత్రం 'దస్విదానియ'

రోజే చూసాను హిందీ సినిమా..
అతి సామాన్యంగా.. జీవితాన్ని గడుపుతున్న.. .. అతి మంచిమనిషికి... .. ఆపద వస్తుంది..
కడుపు కాన్సర్..
అతని చేతిలో 3 నెలలు మాత్రమె ఉంటుంది..
అప్పుడు అతనేం చేస్తాడు.. చనిపోయేముందు ఎం చేయాలి అనుకుంటాడు అనేది చిత్రం ఇతివృత్తం.
దస్విదానియ.. అంటే రష్యన్ భాషలో.. వీడ్కోలు...
నాకు నచ్చింది. ఇంకా.. చిత్రంలోని సంగీతం వీక్షకులని కట్టిపడేస్తుంది.. అల్విదా అంటూ కైలాష్ ఖేర్ పాడిన బాగుంది. సంగీతం కూడా కైలాష్ ఖేర్ అందించారు.
బ్లాగర్ మిత్రుల కోసం.. ఇక్కడ డౌన్ లోడ్ లింక్స్ ఇస్తున్నాను...

Part1


Part2

Part3

Part4

నటీనటులు: వినయ్ పాఠక్, నేహ దుపియా, గురావ్ గేర, సరిత జోషి
ర్శకత్వం: శాశాంత్ షా
సంగీతం: కైలాష్ ఖేర్ (గాయకుడు)
నిర్మాతలు: ఆజం ఖాన్, వినయ్ పాఠక్, శాశాంత్ షా
రచన: అర్షాద్ సయెద్



మరిన్ని వివరాలు ఇక్కడ.

చూసిన వారి అభిప్రాయలు.

గతంలోకి జారిన.. ఓ.. స్నేహం.

తెల్లవారుజాము మూడుగంటలు కావొస్తుంది..
నైట్ షిఫ్టు లో ఉన్న నేను ఉలిక్కిపడ్డాను..
ఆఫీస్ షట్టర్ మీద ఎవరో కొడుతున్నారు...
"ఎవరూ" అని అడిగాను..
"నేను ప్రసాద్ ని.." అని వినిపించింది..
ప్రసాద్ మా ఆఫీస్ లో సేల్స్ చూస్తాడు..
సెక్యురిటి చేత షట్టర్ తీయించాను.. ప్రసాద్ అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నారు.. ఇద్దరికీ చమటలు పట్టి ఉన్నాయి..
ప్రసాద్ కంగారుగా లోపలి వచ్చాడు..
"ఎంటండి.. టైం లో వచ్చారు...?" మాటవరసకి అడిగాను...
"ఎం లేదు.. నాకు మన మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్ కావాలి.."
వెంటనే నా కార్డు మీద ఉన్న నెంబర్ తీసి చెప్పాను...
ఫోన్ డయిల్ చేస్తూ అన్నాడు..
"రంజిత్ కి ఆక్సిడెంట్ అయింది... కుమార్ కి కాలు ఫ్రాక్చుర్ అయింది.. హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను..."
షాక్..! ఒక్కసారిగా భయం వేసింది..
కూడబలుక్కుంటూ అడిగాను... "రంజిత్ కి ఎలా ఉంది?". రంజిత్ మా ఆఫీస్ లో HR
అతను కళ్ళు పైకేతి.. నా వైపు చూస్తూ చెప్పాడు... "రంజిత్ స్పాట్ లో ఔట్.."
మెదడు పని చెయ్యలేదు కాసేపు.. నా మొహం లో భావం లేదు...
అతను ఇన్సురెన్స్ వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు.. నాకేమీ వినిపించడం లేదు...
రంజిత్ అందరితో స్నేహంగా ఉండే వ్యక్తి.... రోజుకి ఒక్క సారయినా నాకు ఫోన్ చేసి "ఎం చేస్తున్నావ్ అని అడిగుతాడు". ఎవరితోను గొడవ పడే వ్యక్తీ కాదు... కాం.. గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయే మనిషి..
నిన్నగాక మొన్న వచ్చి నాతో పదినిమిషాలు మాట్లాడి వెళ్ళాడు... పైగా నా రూం పక్క రూమే అతనిది.. ఇప్పించిందికూడా నేనే..!
ఫోన్ లో మాట్లాడి హడావిడిగా.. వెళ్ళిపోతున్నాడు ప్రసాద్...
డిటైల్స్ అడగాలా వద్ద అనుకుంటూ "ఎలా జరిగింది...?" అన్నాను...
డివైడర్ కి గుద్దేశారు.. అని చెప్పేసి వెళ్ళిపోయాడు... అలాగే నిలబడ్డాను...
అంటే... ఇంకా రంజిత్ లెడా? నిన్నటి దాక నాతో మాట్లాడినతను.. రోజు లేడా? నమ్మశక్యం గా అనిపించలేదు... ఆఫీస్బయట మొన్న మేమిద్దరం నిలబడి మాట్లాడిన ప్రదేశం వైపు చూసాను... బాధగా అనిపించింది..
తప్పకుండా తాగుడు వల్లనే అయిఉంటుంది.... తగ్గించుకోమని చాలా సార్లు చెప్పాను..
ఎలా జరిగిందో కరక్టుగా...... నాకు తెలియదు.. ప్రసాద్ ని అడగలేకపోయాను.. అతను హడావిడిలో ఉన్నాడు..

ఉదయం ఐదు గంటలకల్లా.. ఆఫీసులో పని చేసే వాళ్ళందరికీ తెలిసిపోయింది.
మిగతా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను.. బాడి హాస్పిటల్ లో ఉంది, అందరు వెళ్తున్నారు అని తెలిసింది..
నేను మరొక సహోద్యోగి.. కలిసి ఆటోలో వెళ్ళాం...
"మార్చురీ వైపు వెళ్ళు" నాతో పాటు వచ్చినతను ఆటో అతనికి చెప్పాడు...
ఆటో దిగాం.. స్మశాన నిశ్శబ్దం లాంటిదేదో అక్కడ నిండి ఉంది..
దూరంగా ఎక్కడో ఏడుపులు వినిపిస్తున్నాయ్... అది వేరే వాళ్ళు అనుకుంటా..
మా ఆఫీస్ వాళ్ళందరూ ఉన్నారు అప్పటికే.. రంజిత్ వాళ్ళ తల్లితండ్రులు కూడా ఉన్నారు..
దూరం నుంచి చూసాను ... రంజిత్ వాళ్ళ అమ్మగారు అనుకుంటా కొంగు నోటికి అడ్డు పెట్టుకుని కుర్చుని ఉన్నారు..
కాని ఎవరు ఏడుస్తున్నట్టు అనిపించలేదు..
అందరు ఆక్సిడెంట్ ఎలా జరిగింది.. అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు...
మరొక సహోద్యోగి వచ్చి.. బాడీ లోపల ఉంది చూసి రండి అన్నాడు...
నాతో పాటు వచ్చినతను వేగంగా.. అడుగులు వేసాడు...నేను అతన్ని అనుసరించాను...
మార్చురీ ఎంట్రన్స్ దాక వచ్చాము... నా నడకలో వేగం తగ్గింది.. నేనెప్పుడు వెళ్ళలేదు మార్చురికి...
భయంగా అనిపించింది..
లోపలి వెళ్ళాం.. అంతా బాక్సులు బాక్సులు గా ఉంది గది.. ఎవరో ఒకతను వచ్చాడు...
" నంబరు.." అడిగాడు.. నాకు నోట మాటలేదు..
నాతో పాటు వచినవ్యక్తి..చెప్పాడు..
అతను బాక్సుని బయటకి లాగాడు...
అచేతనంగా.. రంజిత్.. ఎప్పుడు ఉండే చిరునవ్వు అతని మొహం మీద లేదు..
నేను ఒక అడుగు వెనక్కి వేసాను... నిజానికి చూడలేకపోయాను... తలకు బలమయిన గాయం అయింది..
తరవాత తదుపరి ప్రక్రియ కోసం రంజిత్ ని వేరే గదికి తీసుకెళ్ళారు... మమ్మలిని వేల్లిపోమ్మన్నారు..
మేము బయటకు వచ్చేసాం...
ఆలోచిస్తుంటే చాలా బాధగా.. అనిపించింది.. మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి... మంచి మనసున్న వ్యక్తి...
తాగుడు వ్యసనం వల్ల అర్ధంతరంగా.. అన్ని ముగుసిపోయాయి...
కొంచెం దూరం లో ఏడుపు వినిపించింది... రంజిత్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు..
పక్కన ఎవరో ఒదారుస్తున్నారు...
బాడిని వాన్ లో పెట్టె ముందు.. అందరిని చూడటానికి పిలిచారు...
వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకెళ్ళారు..
ఆవిడని ఆపడం ఎవరి తరము కాలేదు... ఏడుస్తూ ఏడుస్తూ ఆవిడా గొంతు బొంగురు పోయింది..
"నాన్నా..... ఎక్కుడున్నవురా..... ఒక్కసారి రా నాన్న...
కన్నా... ఒకసారి అమ్మా అని పిలవరా.. " వెక్కిళ్ళు పెడుతూ.. ఆమె కొడుకు కోసం పెద్దగా ఏడుస్తుంటే...
నా కళ్ల వెంట నీళ్ళు ఆగలేదు..
తరవాత రంజిత్ వాళ్ళ తండ్రి.. ఆయన్ని ముగ్గురు పట్టుకున్నారు.. "ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్.." నిలువునా కదిలిపోతూ.. ఏడుస్తున్నారు ఆయన!
ఆఖరికి వ్యాన్ లో పెట్టేసారు.. మరో వాహనం లో రంజిత్ వాళ్ళ తల్లితండ్రులు ఎక్కారు.. నా కల్ల ముందే వ్యాన్ అలావెళ్ళిపోయింది...
ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోయింది... ఇక నుంచి వ్యక్తీ ఉండదు..అతని గురించి మాటలు ఉండవు..
క్షణం నుంచి అతనో గతం..


కాని రంజిత్.. సాదించినది ఏంటి? ఇరవయ్ అయిదేళ్ళు చదివించి పెంచి పోషించిన తల్లి తండ్రులకు గర్బ శోకంమిగిలిచాడు... బహుశా అతను కూడా ఊహించి ఉండడు.. ఇలా జరుగుతుందని..
చిన్నా సరదా.. చిన్న నిర్లక్ష్యం.. చిన్న ఏమరిపాటు తనం.. కొందరి జీవితాలలో... అగాధం లాంటి చీకట్లనుమిగులుస్తాయి...
మదర్స్ ఢే రోజున కొడుకుగా రంజిత్ ఇచిన బహుమతి.. తల్లిని... భరింపరాని శోకం లో ముంచేసింది..

కారణం.. వ్యసనం.. తాగుడు..
రోజుల్లో మద్యం పుచుకునే వాళ్ళ శాతం ఎక్కువే...
కాని.. తాగి డ్రైవ్ చేయడం.. తాగి రోడ్ల మీద తిరగాలనుకోడం.. అంత శ్రేయస్కరం కాదు...
మనం అంటే.. మనమోక్కరిమే కాదు.. ఎన్నో బంధాలను కలుపుకుంటేనే.. మనం!
సరదా.. సరదాగానే ఉండాలి గాని... సరదా వ్యసనం కాకూడదు..
జీవితాలను ప్రస్నార్దాకం చేసే సరదా.. జీవితాలకు ముగింపు పలికే సరదాలు ఎందుకు?
మన మీద ఆధారపడిన వాళ్ళ కోసం అయినా సరే..
తస్మాత్ జాగ్రత్త!
____________________________
ప్రియ మిత్రుడు... ఎక్కడ ఉన్నా.. అతని ఆత్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
అతని స్నేహాన్ని.. అతని ఆత్మీయతని.. తలుచుకుంటూ.. .. పోస్ట్..

మీ ఇంటి తాళం చెవులు ఎవరికిస్తున్నారు?

ఎప్రిల్ 16, ఎంచక్కా ఆఫీసులకి సెలవు.. కాలేజులు ఉండవు. హాయిగా ఎటన్నా ఔటింగ్ కి వెళితే బాగుంటుంది కదు.
అన్నట్టు ఆ రొజు ఓటు వేయాలి కదా? ఆ అదేమీ పెద్ద విషయం కాదులె, మనం వేసినా వెయ్యాకపొయినా, గెలిచేవాడు గెలుస్తాడు, ఒడెవాడు ఒడ్తాడు.
పొనీ ఉన్న ఒటుహక్కుని వినియోగించుకుందామా? ఎవరికి వేయాలి? ఇదే ప్రశ్న మా ఆఫిసులొ ఒకరిని అడిగితె.. "యార్ కోయి భి జీత్నె దొ, కుచ్ ఫరక్ నయి పడ్తా.." అన్నాడు.. ఎవరొ ఒకరి పేరు చెప్పు వేసెస్తా అన్నాడు, మినపట్టు వేసినంత ఈజిగా..
ఎందుకనో జనాల్లొ అంత నిరాసక్తి..? ఎందుకని ఆ నిర్లిప్తత?
కారణం లేకపొలేదు లె..
ఎవడికి వొటేసినా దోచుకు తినేవాడె.. అలాంటప్పుడు.. ఎవడికి వేస్తె ఎంటి.. వెయకపొతె ఎంటి?
కొట్లకి కొట్లు పొసి టిక్కెట్టు కొనుక్కుంటున్నారు.. కొటి నుంచి పది కొట్ల దాక పలికిందట.. ఒక్కొ టిక్కెట్టు..
అంటే... ఉదాహరణకి.. అయిదు కొట్ల పెట్టి టిక్కెట్టు కొన్నాడు అనుకుందాం.. అంటె... అతను రానున్న అయిదు సంవత్సరాలలొ.. ఎన్ని కొట్ల ఆదాయాన్ని అంచనా వేసి ఉంటాడు..? ఓ.. యాబై లేక వంద దాక వేసి ఉంటాడు కదా..?
దీన్ని ప్రజాసేవ అంటారా లేక వ్యాపారం అంటారా?
నామినెషన్ ఫారం నింపి సరిగా సంతకం చేయడం రాని చవట దద్దమ్మలు.. మనల్ని ప్రజారంజకం గా పాలిస్తారా?
మొన్న పేపరులొ చూశా.. అతగాడు నామినెషన్ ఫారంలొ సంతకం పెట్టడం మర్చిపొవడంతొ, నిరాకరించారంట...
గొల్లుమంటున్నాడు... డబ్బులతొ కొన్న టిక్కెట్టు పొయె.. పొటిలొ నుంచి బయటికి పొయె.. జీవితమే.. ఇరుకున పడిపాయె... నిజం చెప్పొద్దు.. నాకు చెప్పలెని నవ్వు వచ్చింది...
విచిత్రం ఎమిటంటె.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న.. కెవలం దొచుకొడానికె రాజకీయల్లొకి వచిన ఈ రాజకీయనాయుకులు.. ఎంతొ మేదస్సు కలిగిన, అయర్నిశలు శ్రమించి ఉన్నత స్తాయికి చెరుకున్న I.A.S, I.P.S లను శాసించడం..
ఇలాంటి పరిస్తితికి కారణం ఎమిటి? ఎందుకు ఇలాంటి అనర్హులకి పదవులు చిక్కుతున్నాయి? కారణం ఎవరు?
ఇంకెవరు మనమె...! అవును ముమ్మాటికి మనమె... మన ఒటు హక్కుని మనం సరిగా వినియొగించకపొవడమే..
వాడు దొంగ అని తెలుసు... అయినా వాడికే ఇంటి తాళాలు ఇస్తాం మనం..
కొంతమంది మహనుభావులు ఉన్నారు.. వారం రొజుల పాటు దొరికె మద్యానికి, రొక్కానికి.. అయిదేళ్ళు తాకట్టు పెట్టేస్తుంటారు..
తన కొన్నాళ్ళ విలాసానికి... తన భార్యబిడ్డల భవిష్యత్తుని దీర్ఘకాలనికి నడిరొడ్డున పడేస్తున్నాడని అతనికి తెలిసేదెప్పుడొ..
మరి ఇలాంటి రాజకీయ పరిస్థుతుల మద్య వొటు వెయ్యలా? అని అంటే...
సమాధానం..
.........
.........
వెయ్యాలి..!
ఎందుకని?
ఎందుకంటె.. నేను వొటు మాత్రమె వేయడం లేదు... నేను నా అయిదు సంవత్సరాల.. భవిష్యత్తుని ఎంచుకుంటున్నాను..
నాతొ పాటు.. నా స్నేహుతులు.. నా బందువులు.. నా చుట్టు.. ఉన్న అత్మీయులు.. అందరు సౌకర్యం గా భావించె ఒక అరొగ్యకరమయిన వాతావరణాన్ని కొరుకుంటున్నాను...
ప్రతి మనిషి తన హక్కులను తాను దైర్యంగా వినియొగించుకునే.. పరిపూర్న స్వాతంత్ర దేశాన్ని కొరుకుంటున్నాను...
విద్య, వైద్యం, నివాసం.. లాంటి కనీస అవసరాలు తీర్చె ప్రజానాయకులను కొరుంటున్నాను...
అవినీతిలేని నిష్కల్మష సమాజాన్ని కొరుకుంటున్నాను... నా చిన్నతనంలొ కాస్త్ట్ సర్టిఫికెట్ తీసుకున్న ప్రతిసారి.. 20 నుంచి 50/- వరకు లంచం ఇవ్వడం నాకు బాగ గుర్తుంది.. నా పదవ తరగతి చదవడనికి నాకు 50/- ఖర్చు అయితె.. ఈ లంచాలకి ఒ 200/- అయిఉంటుంది..
ఎ పాలన వచ్చినా.. ఎందరు పాలకులు మారిన.. పేదవాడి పరిస్తితిలొ మార్పు రాలేదు.. అదె అదాయం.. అదె కాయకష్టం.. అదె గూడ్సుబండి బ్రతుకు.. ఆగదు.. సాగదు..
మరి ఉద్దరించేవాడు ఎవడు..? పరిష్కారం ఎమిటి?
నెనొకటి సూచిస్తాను... దాని పేరే..
లొక్ సత్తా.. జయ ప్రకాష్ నారయణ..
ఎవరీయన? నాక్కూడా పెద్ద తెలియదు... కాని తెలుసుకున్నాను..
ఒక మాములు మనిషి.. గ్రామంలొ పుట్టి పెరిగి.. ఉన్నత స్థాయికి చెరుకున్న విఙ్ఞాని.
మొదలు ఒక డాక్టరుగా.... తరవత I.A.S అధికారిగా... నేడు రాజకీయవేత్తగా... అయన పయనం సుధీర్గమయినది..
అయన I.A.S అధికారిగా ఉన్నప్పుడు.. ప్రజలకి ఎప్పుడు అందుబాటులొ ఉండెవారని.. ఎ సమయంలొ అయినా, ఎ పరిస్తితిలొ అయినా సమస్యని సాదించడంలొ ముందుండేవారని చెబుతుంటారు...
ప్రస్తుత రాష్త్ర, దేశ, ప్రపంచ సామజిక, అర్ధిక పరిస్తుతులపై అయన విశ్లెషణ అమొఘం..
లొక్ సత్తా కే ఎందుకు వొటెయ్యలి?

* జె.పి గారి గురించి ఫలనా రాజకీయనాయకుడు వెలెత్తి చూపించదం, బురద చల్లడం నెను చూడలెదు.
* లొక్ సత్తా పార్టిలొ.. రౌడిలు, గూండాలు లేరు... ఉన్నవాళ్ళందరు.. ప్రజా సంక్షేమం కొరుకునే యువజనం..
* అడ్మినిస్త్రషన్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి జె.పి.
* అవినీతి నిర్మూలన, పూర్తి ఉచిత వైద్యం, కుల ప్రాతిపదికన రిజర్వెషన్లను నియంత్రించడం, వ్యవసయ రంగం లొ నూతన ప్రణాలికలు లాంటి ప్రదానమయిన అంశాలు కలిగి ఉందటం..
నేను చెప్పెదానికంటె...
ఆయన మాటల్లొనె.. వినండి... ఈ క్రింది లింకు క్లిక్ చెయండి...


All Educated Communities are turning towards Loksatta... But the message is not reaching to illiterates and villages.
Spread About LokSatta.
Dream for a Better Future.

మా దిలిప్ చెప్పిన కధ..

జాబ్ మారడం కొసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా నేను..ఈ రొజు ఒక కొలిగ్ మాటలు విని బాగా డిప్రెస్ అయ్యాను.
"అసలు ఒపెనింగ్సే లేవు మామ. జాబ్ మారి రిస్క్ తీసుకొవద్దు" అని చెప్పాడు. అతను నా మంచికే చెప్పాడు.. కాని ఎంటొ డిప్రెస్సింగ్ అనిపించింది..

ఎప్పుడయినా.. మనసు బాగొపొతె.. స్నేహితుడు దిలిప్ కి కాల్ చేయడం అలవాటు నాకు..
ఉన్న విషయం చెప్పాను..
అయితె అతను నాకు ఒక కధ చెప్పాడు..
"బావా (అలా పిలుస్తాడు లే) నీకో కధ చెప్పాలి..
రెండు కప్పలకి ఒక కొండ ఎక్కే పొటి పెట్టారంట..
అయితే చుట్టు ఉన్న వారందరు..
"కప్పలు కొండ ఎక్కలేవు! ఎక్కలేవు! అంటున్నారంట..
ఒక కప్ప ఆ నిజమేలే.. నా వల్ల ఏమవుతుంది అని కొండ ఎక్కడం ఆగిపొయిందంట..
రెండొది మాత్రం ఎక్కేసిందంట..
ఎలా ఎక్కగలిగింది..? ఎంటబ్బా.. రహస్యం అని చూస్తే... కప్ప చెవిటిదంట...
నువ్వు ఎక్కలేవు ఎక్కలేవు అనె జనాల మాటలు అది వినలెదు.. దాని పని అది చేసుకుంటూ పొయింది..
అలాగే బావా నువ్వు కుడా.. కొన్నాళ్ళు... చెవిటి కప్పవి అయిపో..
జనాలు వంద చెప్తారు... అలాగని ప్రయత్నం ఆపకు.. నువ్వు చెసేది ఎదొ నువ్వు చెయ్యి..." అన్నాడు...
నా ఫెస్ లొ నవ్వు తిరిగి వచింది....

నాకు ప్రేరణ కలిగించిన మా దిలిప్ కధ మీతొ పంచుకొవాలని ఈ పొస్టు పొస్టితిని..
ధన్యవాదాలు..
:-)

The Story of Mr. Subba Rao

ఆదివారం కావడం తొ నింపాదిగా స్వాతి వీక్లీ చదువుతున్నాడు సుబ్బారావు.
"మిని నవల పొటి. పారితొషకం ఇరవయ్ అయిదు వెలు. "
చదువుతూనే సుబ్బారావు కళ్ళు చమక్కున మెరిసాయ్.
"కోటలు దాటె మాటలు తప్పితె పెళ్ళానికి ఒక పట్టుచీర కొనివ్వలేరు" భార్య పంకజం మూతి విరుపుళ్ళు గుర్తొచ్చాయి సుబ్బారావు కి.
"ఎమొయ్! ఈ దసరా కి నిన్ను కొత్త పట్టుచీరలొ చూడాలని ఉందొయ్.." ఎచ్చులు పోతూ అన్నాడు సుబ్బారావు.
"నాక్కూడా నాగార్జున పక్కన హీరొయిన్ గా చెయ్యాలని ఉంది.. అన్ని వీలవుతాయ?" వెటకారం గా అంది పంకజం.
"అబ్బ! అది కాదె.. ముందొక మంచి కాఫి పట్రా చెబ్తాను"
"అదెదొ డైరక్ట్ గా అడగొచ్చుగా... ఈ చీర సాకు ఎందుకు?" విసుక్కుంటూ కిచెన్ లొకి వెళ్ళింది పంకజం.
స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపొయాడు సుబ్బారావు.. నవల రాయాలి ప్రయిజ్ కొట్టాలి.
ఒక వైట్ పేపర్, పెన్ను రెడి చేసుకున్నడు.
విగ్నాలు ఎమి రాకూడదని "ఒమ్ గణపతియె నమ:" అని అనుకుని మొదలుపెట్టబొయేంతలొ..
"ఎమండోయ్! కాఫి పొడి అయిపొయింది....నొ కాఫి అంటిల్ యు బ్రింగ్ బ్రూ" గట్టిగా అరుస్తూ చెప్పింది పంకజం.
"ఆహ! ఎమ్ టైమింగె నీది. కాఫి అక్కర్లేదు గాని కాసెపు అరవకుండా ఉండు." అంటూ అలొచనలొ పడ్డాడు సుబ్బారావు.

రాయాలి సరె.. దేని మీద రాయాలి? ఎ టైప్ రాయాలి?
రొమాన్స్?
అమ్మొ! పంకజం తొ ప్రమాదం. "మీకిలాంటి పాడు ఆలొచనలు కూడా ఉన్నాయా?" అని సెరినా విలియమ్స్ స్టయిల్ లొ నా హెడ్ తొ టెన్నిస్ ఆడేసుకొగలదు అని అలొచనమార్చుకున్నాడు సుబ్బారావు.

క్రైమ్?
సుబ్బారావు వెంటనే టివి999 చానెల్ పెట్టాడు తనకి కావలసిన కధావస్తువు కొసం.
సరిగ్గా వస్తుంది.. "వాచ్ క్రైమ్" ప్రొగ్రామ్...
"సమాజం లొ ఘొరాలు,నేరాలు మీ కళ్ళ ముందుంచే రియాలిటి షొ...వాచ్ క్రైమ్" చెప్పుకుంటూ పొతున్నాడు యాంకర్.
యాంకర్ ని చూసి సగం జడుసుకునాడు సుబ్బారావు. తెలుపు,నలుపు రంగులలొ మాసిన గడ్డం, బుజాల దాక పెంచిన జుట్టు నిజానికి వాడె పెద్ద క్రిమినల్ లాగా ఉన్నాడు.
ఇంతలొ ప్రొగ్రాం స్టార్ట్ అయింది. యాంకరింగ్ నడుస్తుంది.
"సొంత భార్యని దారుణంగా నరికిన భర్త"
సొంత భార్య ఏంటి వీడి పిండాకూడు. సొంత భార్యలు, అద్దె భార్యలు ఉంటారా? వీడి తెలుగు మండినట్టుగానె ఉంది అనుకుంటూ కావాల్సిన సబ్జెక్ట్ కొసం ఒపిగ్గా ఫాలొ అవుతున్నాడు సుబ్బారావు.
"ధారుణమయిన హత్య, తెగిపడిన అవయవాలు" అంటూ క్లొజప్ లొ అంతా చూపించడం మొదలుపెట్టాడు.
కొంచెం ఎరుపు రంగు చూస్తెనే కళ్ళు తిరుగుతాయ్ మన సుబ్బారావు కి, అలాంటిది ఈ క్లిప్పింగ్స్ అన్ని చూసేసరికి భూమి గుండ్రం గా తిరిగినట్టనిపించి ఢామ్మని పడ్డాడు.
పంకజం వచ్చి మొహం పై నీళ్ళు చల్లాక తెలివి వచ్చింది సుబ్బారవు కి.

"వీళ్ళ దుంపల్తెగ... వీళ్ళు క్రైమ్ చూపిస్తున్నారా? నేర్పిస్తున్నారా?" మొహం తుడుచుకుంతూ అన్నాడు సుబ్బారావు.
"మరి లేకపొతె నా మానన నేను మా నాగర్జున "అల్లరి అల్లుడు" చూస్తుంటె మధ్యలొ వచ్చి డిస్టర్బ్ చెస్తారా? మీకు కావల్సిందె.." అంటూ మళ్ళి సినిమా లొ లీనం అయిపొయింది పంకజం.
"ఓసి నీ.. నాగార్జునా పిచ్చి పాడుగాను నిన్ను పోషించేది నేనా ఆ నాగార్జునా నా?" పైకి అంటే ప్రమాదం కాబట్టి మనసులోనే గొణుక్కున్నాడు సుబ్బారావు.
ఈ ప్రయత్నం కూడా ఫ్లాప్ అవడంతొ విసుగొచ్చి అలా రోడ్డున పడ్డాడు సుబ్బారావు.
అలా నడుస్తున్న సుబ్బారవు మైండ్ లొ ఫ్లాష్ లాగా సిగరెట్ తాగుతున్న శ్రీ శ్రీ ఫోటొ కనిపించింది. అప్రయత్నంగా "యురెఖా!!" అని అరిచాడు.
"సిగెరెట్ తాగితే కొత్త ఐడియాస్ వస్తాయ్ అన్నమాట" కొత్త విషయం కనిపెట్టినట్టు సంబరపడిపొయాడు సుబ్బారావు.
అదే స్పీడ్ లొ దగ్గరలొ ఉన్న షాప్ కి వెళ్ళాడు.
"బాబు ఒక సిగెరెట్ ఇవ్వు"
"ఎం సిగెరెట్ సార్?"
ఎనాడు సిగెరెట్ తాగిన పాపన పొలేదు మన సుబ్బారావు. ఎం చెప్పాలొ తెలీక "ఉన్నవాటిలొ మంచిది ఇవ్వు" అన్నాడు.
"ఎంటి....? సిగెరెట్టు? మంచిదా?" వింతగా చూసాడు షాప్ వాడు.
"అది కాదు సార్. ఎ బ్రాండ్ అని అడుగుతున్నా"
"నీ దగ్గర ఎమున్నాయ్?" అయొమయంగా అడిగాడు సుబ్బారావు.
బలే బేరం తగిలింది అనుకుని లిస్ట్ చదివాడు షాప్ వాడు. "విల్స్, గొల్ద్ ఫ్లెక్, క్లాసిక్, ట్రిపుల్ ఫైవ్, బర్క్లి, సిసర్స్, చార్మినార్"
ఎదొ ఒకటి అనుకుంటూ .."క్లాస్సిక్" చెప్పాడు సుబ్బారావు.
"చిన్నదా? పెద్దదా?"
"చిన్నదే ఇవ్వులే"
"ఫిల్టరా? నాన్ ఫిల్టరా?"
"ఫిల్టర్"
"మెంథొలా? నార్మలా?
"నార్మల్"
"మైల్డ్సా? అల్ట్రా మైల్డ్సా?
ఈ కొత్త టర్మినాలజి విని సుబ్బారావు కి బయంవేసి అడిగాడు "అంటే ఎంటి?"
"ఎంటి సార్ మొదటి సారి కొంటున్నారా?"
అవునన్నట్టు తలూపాడు సుబ్బారావు.
"అయితే మీకు అల్ట్రా మైల్డ్స్ కరెక్టు" అంటూ ఒకటి తీసి ఇచ్చాడు షాప్ వాడు.
ఎనిమిది రౌండ్ ల ఇంటర్వ్యు అయ్యి జాబ్ వచినట్లు ఫీల్ అయ్యాడు సుబ్బారావు.

వెంటనే పొకిరి సినిమాలొ మహెష్ బాబు లాగా స్టయిల్ గా వెలిగించి గట్టిగా లోపలికి పీల్చాడు.
అంతె గొంతులొ ఎదొ అడ్డుపడ్డట్టు అయింది. గాలి ఆడలేదు సుబ్బారావుకి.
ఒకటే దగ్గు.... ఆగనె ఆగడం లేదు.
నోరు,ముక్కు,చెవుల నుండి పొగలొస్తున్నట్టుగా అనిపించింది సుబ్బారావుకి.
కాసేపటికి కుదుటపడ్డాడు సుబ్బారావు. షాప్ వాడు ఆ పక్కనె ఉన్న రిక్షా వాడు నవ్వుకొడం గమనించాడు.

సిగెరెట్ పారెసి ఇంకా అక్కడ ఉండకూడదని బయలుదెరాడు సుబ్బారావు.
కొంచెమ్ తల తిరుగుతునట్టు ఉంది సుబ్బారావు కి.

"అయ్యా రిక్షా కావాలా?
రిక్షా వాడు నవ్వాపుకుంటూ అడిగాడు.
"ఎ... నీకొద్దా?" వొళ్ళు మండింది సుబ్బారావుకి.
"అదికాదయ్య... రిక్షా కట్టమంటారా?"
సుబ్బారావు అటు ఇటు చూసి.. "సరె ఆ చెట్టుకి కట్టెయ్" అని విస విస వెళ్ళిపొయాడు.

"శ్రీ శ్రీ గారు నిజంగా గొప్ప వాడె" అంత సునాయాసం గా సిగెరెట్ తాగడం గొప్పే అనిపించింది సుబ్బారావు కి.
ఇంక లాభం లేదు అనుకుని ఇంటిముఖం పట్టాడు.
"అయ్యా! ధర్మం చెయ్యండి బాబు.." వెనకాల నుంచి గొంతు వినిపించి, తిరిగి చూసాడు సుబ్బారావు.
బాగా బలిసి ఉన్న ఓ అయిదన్నర అడుగుల మనిషి కనిపించాడు.
"వీడెంటి దున్నపోతు లాగా ఉండి అడుక్కుంటున్నాడు" అనుకుని..
"చిల్లర లేదయ్యా" అన్నాడు సుబ్బారావు.
"నోట్లు అయినా తీసుకుంటాం సార్. నాకెం ప్రొబ్లం లేదు"
సుబ్బారావు ముష్టివాడ్ని వింతగ చూసాడు.
"పిచ్చివాడ..చిల్లరె లేని వాడి దగ్గర నోట్లు ఎందుకుంటాయ్? అది సరె గాని సుబ్బరంగా ఉన్నావ్ ఎదయినా పని చెసుకోవచ్చుగా?" సలహా ఇచ్చాడు సుబ్బారావు.
"ఆ రొజుల్లొ చేసాం లెండి... అప్పులుపాలయిపొయి.. ఇలా అయ్యాను...
మీరేంటి ఎదొ దిగులుగా కనపడుతున్నారు."
తన కస్టం గుర్తించేటప్పటికి సుబ్బారావు ముస్టివాడని కుడా మర్చిపొయి అతని బుజం మీద చెయ్యి వెసి..
"చూడు మిస్టర్...ఆ.. అన్నట్టు నీ పెరెంటి?
"చలమలసెట్టి వీర వెంకట ఆదిశంకర కమలాకర సుభ్ర్హమణ్య శాస్త్రి."
"ఆ..శాస్త్రి. నా దిగులు ఎంటంటె ఒక నవల రాయలి అనుకుంటున్నాను, కాని ఏం రాయలొ తెలియడం లెదు, పొద్దున్నుంచి ఇదే అలొచనతొ సతమతమవుతున్నా శాస్త్రి" వాపొయాడు సుబ్బారావు.
"అరె! ఎంటి సార్ మీరు? ఇంత చిన్న విషయానికి అంత వర్రి అవుతున్నారా? నా దగ్గర బొళ్ళు కధలున్నయ్ సార్.."
షాక్ అయ్యాడు సుబ్బారావు "ఎంటి నిజమా?"
"అవును సార్..! ఒకటి వదలమంటారా?"
"ఎంటది?"
"అబ్బ... కధ ఒకటి చెప్పమంటారా?"
"ఆ... తొందరగా వదులు.."
"సరే వినండి.. ఒక పదిహెనేళ్ళ కుర్రాడు.. చిన్నప్పుడు.. ఒక కిల్లర్ బాచ్ తొ కలుస్తాడు..పెద్దయ్యాక పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అవుతాడు. తరవాత ఒకసారి పొలిస్ లు వెంబడిస్తున్నప్పుడు.. తన వలన ఒక అమాయకుడు చనిపొతాడు.. మన హిరొ కిల్లర్..అతని డిటెల్స్ అన్ని తెలుసుకుని అతని కుటుంబాన్ని ఉద్దరించడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు.."
"ఆగాగు..." ఇది ఎక్కడొ విన్నట్టు ఉందె?"
"ఆ ఉండదా మరి? కధ రాయడం అంటె ఇదె సార్! కొత్త కొత్త కధలు ఎక్కడనుంచి వస్తాయ్? ఉన్న కధలనే మొదలు ఒక ట్విస్ట్ చివరొక ట్విస్ట్ ఇస్తె కొత్త కధవుతుంది..ఇదె సార్ సిక్రెట్."
"ఇంత బతుకు బతికి కాపి కొట్టి నవల రాయలా?" ఎందుకొ శాస్త్రి సలహా నచ్చలేదు సుబ్బారావుకి.
"హు.. సరె శాస్త్రి. సలహా కి థాంక్స్. ఈ పది ఉంచు" అని అక్కడనుంచి బయలుదేరాడు సుబ్బారావు.."
.................


భార్య చేసిన పప్పుచారు, బంగాళదుంప వేపుడు కమ్మగా లాగించేసి మంచమెక్కాడు సుబ్బారావు.
"రాయడం అంటె అంత సులువు కాదు సుమీ!" మనసులొ అనుకున్నాడు సుబ్బారావు.

"పొద్దున్నెదొ పట్టుచీర అన్నారు?" తమలపాకులకి సున్నం రాస్తూ వచ్చింది పంకజం.
గతుక్కుమన్నాడు సుబ్బారావు "ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి? అనవసరంగా ఆవేశపడి ఎవేవొ వగ్ధానాలు చెసేసాను.. ఇప్పుడు ఎలా" అనుకున్నాడు మనసులొ..
ఎదురుగా కుర్చున్న పంకజం వంక చూశాడు సుబ్బారావు..
అహా! ఎమి అందం.. ఇప్పుడే స్నానం చేసిందొ ఎమో వర్షంలొ తడిసిన బొండుమల్లె లాగా ఉంది పంకజం.
"బంగారం.." ప్రేమ ఎక్కువయితే ఇలాగె పిలుస్తాడు మన సుబ్బారావు.
"మ్...." తలెత్తకుండా... దీర్ఘం తీస్తూ పలికింది పంకజం..
"ఎమిటే.. ఈ రొజు ఇంత ముద్దు ముద్దుగా ఉన్నావ్?"
"అంతా మీ భ్రమ నేను ఎప్పుడూలాగానె ఉన్నాను.." మనసులొనె ముసి ముసిగా నవ్వుకుంటూ అన్నది పంకజం...
"అవునా?.. హుమ్.. ఈ అందాల సుందరి నా సొంతం అవడం నా అదృష్టం కదు?"
"నిజమా...?" వచె నవ్వు ఆపుకుంటూ.. చిలక చుట్టి సుబ్బారావు నొట్లొ పెట్టింది పంకజం..
"ఒక్క మాట చెప్పనా పంకజం.."
"అబ్బా... చెప్పండి..." విసుగు నటిస్తూ అన్నది పంకజం
"నీ అందం ముందు పట్టుచీరలు, నగలు ఎ మూలకి చెప్పు? వాయిల్ చీర కట్టినా విశ్వసుందరి లాగా ఉంటావె. .."
సుబ్బారావు నిజమయిన ప్రెమతొ... మనస్పూర్తిగా అరాదించె వైనం చూసి పంకజం అనంద గంగా ప్రవాహమయింది...
"చీ.. పొండి ..మీరు మరీ పొగిడేస్తారు..!!" అంటూ సుబ్బారావు ఒడిలొ వాలిపొయింది పంకజం.
కాలాన్ని ప్రేమ తన ఆధీనంలొకి తెచుకుంది.
సుబ్బారావు కధ సుఖాంతమయింది.

అమ్మాయి!..........జాగ్రత్త



ముఖేశ్.

ముఖేశ్ తాపీగా బెడ్ మీద పొడుకుని, తన మొబైల్ తీసుకుని ఒక నంబర్ డయల్ చేసాడు. ఆ నంబర్ కాల్ సెంటర్ లొ వర్క్ చేస్తున్న గీతది. నెల రోజుల క్రితం అఙ్ఞాతవ్యక్తిలా కాల్ చేసి మెల్లగా పరిచయం పెంచుకున్నాడు ముఖేశ్. సరెలే ఎదొ టైంపాస్ కె కదా అని గీత కూడా మాములుగా మాట్లడటం స్టార్ట్ చేసింది.

"హాయ్ గీత ఎలా ఉన్నావ్?" సహజం గా ముఖేశ్ కంఠం చాల మ్రుదువుగా ఉంటుంది.
"బాగున్నాను."
"నిన్ననే మాట్లాడానా.. ఎంటొ చాలా రొజులు అయినట్టుగా ఉంది గీతు" ఇలా ముద్దుగా పిలవడం ముఖేశ్ కి వెన్నతొ పెట్టిన విద్య.
"అవునా!" ముఖ్తసరిగా అన్నది గీత.
"నిన్న వర్షం పడింది కదా?" అడిగాడు ముఖేశ్.
"అవును ఎ?"
"అప్పుడు నేను మా విండొ దగ్గరకి వెళ్ళి నుంచొన్నా.. అప్పుడు నా మీద వాన చినుకులు పడుతుంటే.. నిజం చెప్పనా గీతు.. ప్రతి చుక్కలొనూ నువ్వె. నువ్వే చినుకులుగా మారి నా పడుతున్న ఫీలింగ్.."
ఇలా మాట్లాడటం ముఖేశ్ కి కొత్త కాదు..
కాని గీతకి ఇవన్ని ఎప్పుడు వినని మాటలు.
అప్రయత్నంగా "నిజమా?" అన్నది.
ఆ మాత్రం రెస్పాన్స్ చాలు ముఖేశ్ కి "నిజంగా! ఇంతకమునుపు ఎన్నడు ఇలాటి ఫీలింగ్ రాలేదు నాకు."
అతని భావ వ్యక్తీకరణ కి ముగ్దురాలయింది గీత.
"ఒకటి అడగనా?" అభ్యర్దనగా అడిగాడు ముఖేశ్
"అడుగు"
"రేపు ఆదివారం కదా... నేను నిన్ను కలవచ్చా? జస్ట్ ఊరికే.. ఒకసారి చూడాలని ఉంది"
ఎందుకొ వద్దనలేకపొయింది గీత.
ఆ తరవాత గీత అతనిని కలవడం.. అతని మాయలొ పడటం..
కొన్నాళ్ళకి అతని నిజ స్వరూపం తెలియడం, కుమిలి కుమిలి ఎడ్చి మళ్ళి మెల్లగా తన దైనందిన జీవితంలొ పడటం..
వరసగా జరిగిపొయాయి.
- - - - - - - - -
ప్రభాకర్.

నెట్ వర్క్ కాన్సెప్ట్స్ మరియు హాకింగ్ పైన మంచి పట్టు ఉన్న వ్యక్తి.
ఆన్ లైన్ లొ మొదట మంచితనం చూపించి అవతలి వ్యక్తుల ఉనికిని పసిగట్టడం, వారి వెబ్ కాం లను హాక్ చేసి రికార్డ్ చేయడం,
ఆడపిల్ల లతొ చాట్ చెసి, విలాస వంతమయిన జీవన విదానం, బైక్ రైడింగ్ లు, మొడర్న్ కల్చర్ లాంటి మాటలు చెప్పి అమాయకులయిన ఆడపిల్లల్ని లొబరుచుకుని అవసరమయితె బ్లాక్ మెయిల్ చేసి తన అవసరాలు తీర్చుకొడం ఇతని అలవాటు.
- - - - - - - - -
వంశీ.

మంచి అందగాడు. గర్ల్స్ కాలేజెస్ దగ్గర ఉదయం,సాయంత్రం కనబడుతుంటాడు. ఒక అమ్మాయిని టార్గెట్ చేసి, ఆమె కాలెజ్, టుషన్స్ వెళ్ళే టైమింగ్స్ తెలుసుకుని, రొజూ ఆమె కంటపడుతూ,చిరునవ్వు నవ్వుతూ ఇంప్రెస్స్ చెయ్యడం, చాన్స్ రాగనె ఒక గులాబి ఇవ్వడం ఇతనికి అలవాటు.
పోతె ఒక రుపాయి గులాబి పొతుంది, పడితె అమ్మాయి పడుతుంది ఇది అతని పాలసి.
ఇతని బారిన పడిన ఆడపిల్లల సంఖ్య తక్కువేమి కాదు.

- - - - - - - - -

ఇలా చెప్పుకుంటూ పోతె ఇటువంటి వారి లిస్ట్ కి అంతమే లేదు.
పైన చెప్పినవన్ని ఏ పుస్తకం లొనో చదివిన కధలు కాదు. టి.వి. సీరియల్స్ అంతకన్నా కాదు. కళ్ళముందు సొసైటి లొ జరుగుతున్న సత్యాలు.
ఇంతే కాదు..
ఆడపిల్లల చేత ఫొన్లొ సరసంగా మాట్లాడిస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి ఫ్రెండ్స్ కి వినిపించెవాళ్ళు..
రికార్డ్ చేసి నెట్ లొ అప్ లొడ్ చెసేవాళ్ళు.
ఫొటొ లు మార్ఫ్ చేసి ఫేక్ ప్రొఫయిల్స్ క్రియేట్ చెసేవాళ్ళు.
ఆడపిల్లల నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు.
ఈ రకంగా వికృతమయిన ఆలొచనలు ఉన్న జనాలు సమాజంలొ చాలానె ఉన్నారు.
ఇప్పుడు మొసగాళ్ళకి టాలెంట్ చాలా ఎక్కువ..
పొయిటిక్ గా మాట్లాడటం తెలుసు. రంగుల ప్రపంచం చూపించడం తెలుసు. "ఎరా, బుజ్జి, బంగారం, కన్నా" అంటూ బుజ్జగిస్తూ బుట్టలొ వేసుకొడం తెలుసు.
మరి ఎలా?
ఎవరు జెన్యున్? ఎవరు చీటర్?
ఎలా పసిగట్టాలి?

- తక్కువ పరిచయంలొ ఎక్కువ అభిమానం, అతి ప్రేమ కురిపించే మాటలు మాట్లాడే వారిని నమ్మొద్దు.
- చాట్ లొ, ఆన్ లైన్ ఫొరమ్స్ లొ పరిచయమయిన వాళ్ళతొ మీ పర్సనల్ విషయలు పంచుకొవద్దు, ఫోటొలు పంపొద్దు, అంతగా ఫొటొ చూపించాలి అంటె
ప్రొఫైల్ డిస్ప్లె లొ పెట్టి చూపించండి.
- తెలియని వాళ్ళని మీ చాట్ లిస్ట్ లొయాడ్ చేసుకోవద్దు, ఒక వేళ అతను హాకర్ అయితే మీ గురించి అంతా తెలుసుకొగలడు.
- రోజుల పరిచయానికి "అమ్మ, బంగారం, బుజ్జి, కన్నా" అని సంబొదిస్తుంటే, అతను మిమ్మల్ని పడెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని అర్దం.
- ఒక కొత్త వ్యక్తి ని కలిసెటప్పుడు, కేవలం ఒక మీట్ తొ అతని గురించి ఒక అవగాహన కి రావద్దు. మొదటి సారి ఎవరయినా డీసెంట్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
- ఒక వేళ మీరు మొదటి సారి ఒక చాట్ ఫ్రెండ్ ని కలుస్తున్నట్లయితె.. మీటింగ్ పాయింట్ గా నిర్జన ప్రదెశాలను ఎంచుకొవద్దు.
- ఫొన్ లొ మాట్లాడే టప్పుడు.. మీకు ఎదయినా బీప్ సౌండ్ వస్తుంటే.. అవతలి వాళ్ళు మీ సంభాషణ రికార్డ్ చేస్తున్నారని అర్ధం.
- "లైఫ్ చాల చిన్నది, మన చేతిలొ ఉన్నప్పుడే అనుభవించాలి" ఇలాంటి పనికిరాని వేదాంతం చెప్పేవారిని అస్సలు నమ్మొద్దు..
- ఆఖరిగా.... ప్రలొభాలకు, ప్రసంశలకు లొంగిపొవద్దు.
ఇదంతా ఎదొ.. ఇప్పటికిప్పుడు అనుకుని రాసింది కాదు. చాలా రోజుల నుంచి గమనించిన విషాయలన్నీ ఒక చోట చేర్చి రాస్తున్నాను.


నేను చెప్పాలనుకున్న మాట ఒక్కటే... "అమ్మాయి!...........జాగ్రత్త!!"

ఆ సినిమా అయిపొయింది..

(ఆర్కుట్ లొ కవితలకి ఒక కమ్యునిటి చూసాను. ఎం కవితలు ఉన్నాయా అని చూస్తే సగం పైగా ప్రేమ లొ విఫలం అయిన వారివే కనపడ్డాయి. అప్పుడు వాళ్ళని ఉద్దేసించి ఎమన్నా రాయాలి అనిపించింది. అలా రాసిందే ఈ 'ఆ సినిమా అయిపొయింది)

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

గుండెకోత, నెత్తుటి మరక, చితికిన మనస్సు,
చిట్లిన ఫాళి,చెదిరిన కలలు, హృదయ సునామీలు..

చాలన్నా! చాలు!!

గుండెలొ కార్చిచ్చుకు ఆఙ్నం పొస్తూ..
ఏడబాటు అనే కాలాంతపు ప్రళయంలొ మునకలు వెస్తూ...

చాలన్నా! చాలు!!

తెలుసా..
నిన్న అది సంచలనం..
నేటికి వార్త..
రేపటికి బాబి గాడి చేతిలొ మిఠాయి పొట్లం.

శ్వాసించె ప్రాణవాయువు, స్పందించె అశ్రువు, నాడులలొ జీవాన్ని..
గతమనే కసాయికి బలి ఇస్తున్న ఓ త్యాగశీలి..
చూపులలొ చైతన్యం, వేళ్ళలొ నైపుణ్యం, పెదవుల సుమధుర ధరహాసాన్ని..
నిన్నటి కాష్టంలొ తగలబెడుతున్న ఓ మహా ఋషి..

చాలన్నా! చాలు!!

నిన్నటి నిద్ర నుంచి లేచి కళ్ళు చికిలించి చూడు..
కొత్తపుంతలు తొక్కుతూ నిన్ను తాకుతున్న ఆ లేత కిరణాలు చూడు..
విరహమనే వ్యసనంతొ నీలొ అణిచివెయబడ్డ, నీ సృజనాత్మకత కోసం యుగాలుగా వేచి చూస్తున్న ఆ ప్రకృతి కాంతని చూడు..

అవును
ఆ సినిమా అయిపొయింది..
అరికాలిలొ ముల్లు లాంటి ఆ గతం మనకొద్దు..
కళ్ళలొ సంద్రాలకి ఆనకట్ట కట్టి, చిరునవ్వుల సన్నజాజులు పూయించు

నిన్ను మరచిన కాలానికి చెప్పు "నే.. వస్తున్నా!!" అని..
నీ వెనుక గుసగుసలకి చెప్పు "ఖబడ్ధార్" అని..
లె!!.. ఓరలొ కత్తి లెదంటె సుత్తి
అయితే కలం కాకుంటే మనొఫలకం
ఆనాటి విన్యాసం మళ్ళీ రుచి చూపించు

నీ అడుగుల ప్రకంపనాలకి దిక్కులు ఉలిక్కిపడాలి
నీ తర్కానికి, విఙ్నానికి విజయలక్ష్మి దాసొహమనాలి
నీ వేగానికి సుడిగాలి నివ్వెరపొవలి

సత్ప్రవర్తన నీ తండ్రి, సత్కార్యం నీ తల్లి,
క్షతగాత్రుల పెదవులపై నవ్వులే నీ సొదరులు.

కులం పై కలం.

పార్ధు: నన్నెవరూ డిస్టర్బ్ చెయ్యొద్దు.
జనాలు: నిన్నా? మాకు వేరె పని లేదనుకుంటున్నావా?
పార్ధు: సీరియస్ గా ఎమన్నా రాద్దామనుకుంటున్నా...
జనాలు: అమ్మొ! వీడు మళ్లి ఎదొ బుర్ర తినే కార్యక్రమమ్ పెట్టినట్టున్నాడు రా..
పార్ధు: హుమ్ మ్ మ్.... మనిషి పుట్టాడు...
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: మనిషి పెరిగాడు..
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: మనిషి పొయాడు.
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: అసలు ఎందుకు పుట్టాలి? ఎందుకు పొవాలి?
జనాలు: ఒరెయ్! మమ్మల్ని వదిలెయ్యరా బాబు.
పార్ధు: చ! ఈ జనాలకి బొత్తిగా టేస్ట్ లేదు.

బై ద వె.. అందరికి దండాలండి.. నా పేరు పార్ధు.
అసలు పేరు పార్ధ సారధి. కూతంత ఇస్టయిల్ గా ఉంటదని అలా చెప్పుకుంటుంటాను.
అందులొ...ఆ మధ్య "అతడు" సినిమా పుణ్యమా అని నా పేరు బాగా పాపులర్ అయింది. (తొక్కలొది... నన్ను అడక్కుండా నా పేరు పెట్టుకున్నారు )
జనాలు: వీడి సొది తగలెయ్యా!
పార్ధు: నా గురించి చెప్పాలంటె... చాలా కష్టమ్. ఎందుకంటే చెప్పుకొడానికి ఎమి లేదు కాబట్టి.

నాలొ నాకు నచ్చేవి రెండే రెండు... ఒకటి నా పేరు. రెండు నా మాట.
జనాలు: సెల్ఫ్ డబ్బా చాలురా ఒరెయ్...
పార్ధు: బెసిక్ గా జనాలు ఎమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకొను.. యట్ ద సెమ్ టైమ్ విమర్సించను.. నా దారి నాదె.
జనాలు: రహదారి ఎం కాదు?
పార్ధు: చి!! ఈ జనాలకి అసూయ నేనంటె. వాళ్ళని పట్టించుకొకండి మీరు.
అసలు అసూయ ఒకటే కాదు.. ఈ జనాలకి చాలా యదవ లక్షణాలు ఉన్నాయ్.
కుల పిచ్చ, మత పిచ్చ...అవును నిజం.
ఆశ్చర్యం ఏంటంటే.. రేపటి తరాన్ని పాలించబొయే.. యువత లొ కూడా ఇదే పిచ్చ..
ఏమిటీ కులం?
మంచి,చెడు కులం తొ నిర్ణయించబడుతుందా?
ఒక కులం లొ ఉన్న ప్రతి వారు ఉత్తమోత్తములు అని చెప్పగలమా?
నిన్నటి తరం చాదస్తం లొ ఉంది అనుకుంటే.. నేటి తరం పూర్తిగా మతి భ్రమించి ఉంది.. కాలేజిల్లొ, పెద్ద పెద్ద యూనివర్సిటి ల్లొ కులం పేరు తొ వర్గీకరణ..

నాకనిపిస్తుంది మతం కంటె కులం చెడ్డది. మతం దేశాలని విడదీస్తె.. కులం వీది వీది ని విడదీస్తుంది..

"కొనవూపిరి తొ ఉన్నప్పుడు.. రక్తమిచ్చేవాడిని అడుగుతామా 'నీ కులం ఏంటి? అని" అప్పుడేమయింది.. కాస్ట్ ఫీలింగ్?
ఒహ్హ్ ప్రాణమే పొయాక తొక్కలొ కులం ఎక్కడుంటుంది అన్న భయమా?

Dear Friend..
లోకం లొ ఉన్నవి రెండే కులాలు ఒకటి 'మంచి ' రెండు 'చెడు ' .
మతం పేరు తొ రాజకీయం చేసి వొట్లు దండుకునె.. అవకాశవాదుల.. మాటలు విని మొసపొకు... అవన్ని పదవుల కొసం చెసే ఫీట్ లు.

కులం పేరు తొ కంచెలు వేసుకోకు.. చేయి అందించు.. స్నేహాన్ని పంచు.. ప్రశాంత జీవితాన్ని అనుభవించు, భావితరాలకి అందించు..

హా.... నీరసమొచ్చింది..
Emotion ఎక్కువయినట్టు ఉంది..
అన్నట్టు ఈ జనాలు ఏరి? హి హి జంపు జనార్దన్ అనుకుంటా...