ఎండమావుల నడుమ పూదోట

శనివారం సాయంత్రం..
బార్ లో జనం కొంచెం ఎక్కువగానే ఉన్నారు.
ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒంటరిగా, మౌనంగా కుర్చుని ఉన్నాడు రఘు. ఎదురుగా ఉన్నా విస్కీ పోసిన గ్లాసు వంక తదేకంగా చూస్తున్నాడు. గ్లాసులో ఉన్నా ఐస్ క్యూబ్ గిర గిరా తిరుగుతుంది, సరిగ్గా తన మనసులో ఆలోచనల సునామి లాగా.
చుట్టూ పక్కల జరుగుతున్నవి ఏవీ తనకి సంబంధం లేనట్టు, ఈ ప్రపంచంలో తను ఒక్కడే మిగిలిపోయినట్టు, జీవితం ఇక్కడే ఆగిపోయినట్టు.. నిస్తేజంగా ఉన్నాయి అతని కళ్ళు.

"హాయ్ రా" ఎవరో పిలిచినట్టు ఉంటే తలపైకెత్తి చూసాడు రఘు.
'ప్రశాంత్' , తన చిన్న నాటి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ప్రతి సంతోషం లోను ప్రతి బాధలోనూ పాలు పంచుకున్న వ్యక్తి.
"ఏంట్రా... ఉన్నట్టుండి రామ్మన్నావ్?" రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ప్రశాంత్.
రఘు మౌనంగానే ఉన్నాడు. ఇంతలో బేరర్ వచ్చి ప్రశాంత్ కి కూడా ఒక విస్కీ గ్లాసు పెట్టి వెళ్ళాడు.
అయిదు నిమిషాలు మౌనంగానే గడిచిపోయాయి.. ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది. రఘు జీవితంలో ఏదో ఊహించనిదే జరిగింది.

మళ్ళి కదిలించడానికి ప్రయత్నించాడు ప్రశాంత్..
"ఏమయింది రా? ఏదయినా సమస్యా?"
తల పైకేతి ప్రశాంత్ వైపు చూసాడు రఘు..
రఘు కళ్ళలో పలచటి కన్నీటి తెర. గద్గద స్వరంతో ఒక్కో మాట కూడబలుక్కుంటూ అన్నాడు.."అంతా అయిపోయిందిరా, ఇంకేం మిగల్లేదు నా జీవితానికి"

రఘుని అలా చూడగానే కలవార పడిపోయాడు ప్రశాంత్. వెంటనే లేచి రఘు పక్కగా వచ్చి కూర్చుని, అతని బుజం మీద చేయి వేసి
"ఏమయింది రా? నాతో చెప్పరా.." బుజ్జగిస్తూ అడిగాడు ప్రశాంత్.
"వచ్చే నెల తన పెళ్లి" తల వంచుకుని చెప్పాడు రఘు.
"అదేంట్రా తను ఇంట్లో చెప్తానంది గా?" విస్మయంగా అడిగాడు ప్రశాంత్.
"చెప్పింది. వోప్పుకోలేదురా వాళ్ళు. కులం పట్టింపు ఎక్కువారా వాళ్ళ నాన్నకి. ససేమీరా అన్నారు."
"మరి తనేమంది?"
"తనేం చేయలేదురా.. వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా తను ఏమి చేయలేదు. ఒక వేళ ఏమయినా చేసినా.. తరవాత వాళ్ళ నాన్నని ఊర్లో అందరు చులకనగా చూస్తూ, అవహేలనగా మాట్లాడితే తను బరించలేను అంటుంది. తనను ఎంతో ప్రేమగా చూసే తండ్రి, తన వలన అందరి చేత మాట పడటం తను బరించలేను అంటుంది. కాని తను కూడా చాల ఏడుస్తుంది రా.."

"అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయిందన్నమాట"

"అవును, ఇంక చేసేది ఏమీ లేదు. కాని తను లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా రా.. ఏ పని చేస్తున్న తనే గుర్తొస్తుంది, గుండెలు పిండేసినట్టు ఉంటుందిరా. ఈ భాద బరించేకంటే చావడం మేలనిపిస్తుంది. అసలు తనని ఇంకో వ్యక్తీతో ఊహించుకోలేకపోతున్న రా" పూర్తిగా కన్నీళ్ళ పర్యంతమయ్యాడు రఘు.

ప్రశాంత్ కి పరిస్థితి అర్ధమయింది.

"రఘు నీ పరిస్తితి అర్ధం చేసుకోగలను.. బాధపడకు. కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయి. కొంచెం నిబాయించుకో.."
"నా వల్ల కావడంలేదురా... నాకు ఇంకేమి జీవితం కనపడటం లేదు"
"అందుకని ఇలా రోజు తాగి, ఏడుస్తూ తాగుబోతులా తయారవుతావా..?"
"నీకేం తెలుస్తుందిరా.. నా బాధ.. అనుభవిస్తే తెలుస్తుంది.." ఉక్రోషంగా అన్నాడు రఘు.
"అరేయ్.. ఒక్క మాట అడుగుతాను చెప్పు.. తన పరిస్థితి ఏంటో ఆలోచించావా?"

ప్రస్నార్దాకంగా చూసాడు రఘు.
"నీకు బాధగా ఉంటే.. స్నేహితులందరికీ చెప్పుకుంటావు. ఇలా బార్ కి వచ్చి తాగుతావు. ఆ తరవాత మత్తులో ఒళ్ళు మీద తెలియకుండా పోడుకుంటావు. మరి తనేం చేస్తుందిరా? తనకి కూడా బాద ఉంటుంది గా?"
రఘు ప్రశాంత్ వంక భావరహితంగా చూసాడు..

"అవును రా.. తను నీకు లాగా అందరికి చెప్పుకోగాలాదా? నీకు లాగా తాగి పడిపోగాలదా? తనలో తానూ కుమిలిపోవల్సిందేగా..
పైగా ఇలా తాగి జీవితాన్ని పాడు చేసుకుంటున్న నిన్ను చూసి.. తను ఇంకా నరకం అనుబవించాలిగా.. ఇది ఎప్పుడయినా ఆలోచించావా నువ్వు?"
నిజమే.. ప్రశాంత్ చెప్తున్న కోణంలో తను ఎప్పుడు ఆలోచించనేలేదు..
రఘు నిశ్సబ్దంగా ప్రశాంత్ మాటలు వింటూ ఉండిపోయాడు.

"రఘు, చేతిలో చేయడానికి ఏమి లేనప్పుడు. నువ్వు బాదపడుతూ.. తనని కూడా ఎందుకు క్షోభకు గురిచేయాలి?"
ప్రశాంత్, రఘు బుజం మీద చేయివేసి చెప్తూ ఉన్నాడు..

"ప్రేమ ఎప్పుడు ఎదుటి వారి సంతోషాన్ని మాత్రమె కోరుకుంటుంది.. అలా కోరుకోవాలి అదే నిజామయిన ప్రేమ. అన్ని అనుకూలించినప్పుడు ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన సంతోషాన్ని నువ్వు కాంక్షించాలి. చెప్పడం తేలికే.. కాని ప్రయత్నించు. తనకి సంతోషంగా కనపడు. నువ్వు నార్మల్ అవ్వగలవని తనకి అనిపించేటట్టు చెయ్యి. పనిలో ఏకాగ్రత పెట్టు. కొంత కాలం ఆగి చూడు. అన్ని సర్దుకుంటాయి. తన జీవితం బాగుండాలి అని కోరుకో."
ప్రశాంత్ మాటలు వింటున్న రఘు ప్రశాంత్ మీద వాలి పోయి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.

"ఒకటి గుర్తు పెట్టుకోరా రఘు, గుండెలు పిండే బాద ఉన్నా.. ప్రేమించిన వారి కళ్ళలో సంతోషాన్ని చూడలనుకోడమే.. ప్రేమ"

ఆకరి బొట్టు వరకు ఏడ్చాడు రఘు. కాని ప్రశాంత్ మాటలు అతన్ని ఆలోచింపచేసాయి. మనసులోనే అనుకున్నాడు..

"ఎండమావుల నడుమ పూదోట పూయిస్తాను... నీ అందమయిన జీవితానికి కానుకగా"

ఇది ఏ ఊరొ చెప్పగలరా?

వీరి వీరి గుమ్మడి పండు.. ఊరు పేరు ఏమి?


           ఏదో పల్లెటూరు అనుకుంటున్నారా? కాదు. పోనీ ఒక మామూలు చిన్న సైజు టౌను అనుకుంటున్నారా.. అసలు కాదు.
ఇది దేశంలోని మహా నగరాలలో ఒక పేరు మోసిన నగరం. సోది ఆపితే ... బెంగుళూరు సిటి. కొన్ని విషయాలలో బెంగుళూరుకు మంచి పేరు ఉంది. Planned City అని, రోడ్లు గట్ర బాగుంటాయని అంటుంటారు. మరి ఈ ఎలక్ట్రసిటి వాళ్ళకి ఏమి మాయరోగమో అర్ధం కాదు.. ఈ ఏరియాలో ఎక్కడ చూసిన ఇంతే.. చేతి కందే ఎతులో ఇలా వాయిర్లు వేలాడుతూ ఉంటాయి.. బ్రాకెట్లో కరంటుతో..
ఈ ఫోటో లో చూపించింది ఒకటే కాదు. ఇక్కడ ఎక్కడ చూసిన ఇదే బాపతు. సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ చేయి పైకి ఎత్తారనుకోండి. యమ స్పీడుగా యముడ్ని చేరుకోవచ్చు. సిటి అవుట్ స్కర్ట్స్ అని నిర్లక్స్యమో.. లేక మరేమిటో నాకు తెల్వద్
అదీ కాదండి.. సిటి అవుట్ స్కర్ట్స్ లో ఉండేవాళ్ళు మనుషులు కార? ఆహా.. కారా అని ప్రశ్నిస్తున్నాను. మీరు పీల్చిన గాలినే మేమూ పీలుస్తున్నమండి. మీరు తినే పీజాలు బర్గార్లనే మేమూ తింటున్నాము.. (అంటే వేరేవి ఎంగిలివి కాదు). 

         ఈ పక్షపాత ధోరణిని తీవ్రంగా.. ఖండ ఖండాలు గా ఖండిస్తూ .. సెలవు తీసుకుంటున్నాను..
                                                                      జై హింద్..

అందరు సుఖపడాలి నంద నందనా...

సమయం ఒంటిగంట దాటింది...
అలవాటు ప్రకారం కడుపులో రాట్ రేస్ మొదలయింది. చేసిన పని చాలు అనుకుని కీబోర్డ్ మీద WINDOWS + L కొట్టి లంచ్ కి ఉపక్రమించాను. అలా నడుచుకుంటూ డౌన్ ఫ్లోర్ లో ఉన్నా Cafeteria కి వెళ్లాను. ఫుల్ రష్ గా ఉంది. ఇంతలో మా కలిగ్ కనిపించి ఇద్దరికీ నాన్ మరియు ఆలు గోబీ ఆర్డర్ చేసింది. కాసేపటి ఎదురు చూపులు తరవాత రెండు ప్లేట్లు వచ్చాయి. ఇక అలా ఒక టేబుల్ చూసుకుని, పిచ్చా పాటి మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టాం.
           ఆలు గోబీ చేసినవాడికి బ్లడ్ ప్రషర్ సమస్య ఉన్నట్టు ఉంది, బొత్తిగా ఉప్పు కారం వేయలేదు. తప్పదు అన్నట్టు అలా తినడం మొదలుపెట్టాను. నా మొహం చూసి మా కలిగ్ అడిగింది..  "How is it?" అని. "Yaa Yaa... Good Good." అన్నాను ఇకిలించుకుంటూ. మొహామాటం కదా.. నచ్చలేదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు. అలా నాన్ రెండు ముక్కలు తిన్నాక..  నాన్ యొక్క భౌతిక స్థితి లో ఏదో మార్పు వచినట్టుంది. రెండు వేళ్ళతో త్రుంచడం అవ్వడం లేదు. సరే రెండో చెయ్యి కూడా పెట్టి త్రుంచి నోట్లో పెట్టుకున్నా. హావాయ్ చెప్పు ముక్క ఏదో నోట్లో పెట్టుకుని నవిలినట్టు అనిపించింది. ఈ రకంగా ఒక్కో ముక్క క్రష్ చేయడానికి నానా అవస్థా పడాల్సోస్తుంది. తిండి తినడానికి ఇన్ని కష్టాల? అవసరమా అనిపించింది..
        సో మిగతాది అలాగే వదిలేసా.. "Hey! Whaaat Haappen?" అంది మా కలిగ్. "Yaa! its OK. I am not much hungry" అని మళ్ళి ఇకిలించాను. అసంతృప్తిగా ముగిసిన లంచ్ బ్రేక్ తో మళ్ళి నా డెస్క్ చేరుకున్నా. 'డబ్బు పోయే శని పట్టే' అంటే ఇదేనేమో. ఈ సమస్య నాకేనా లేక అందరికినా? నాకు తెలిదు.

        సాయంత్రం ఇంటికి వెళ్తూ ఎమన్నా చిరుతిండి తిందామని రోడ్డు పక్కన ఆగాను (ఎప్పుడు తిండి గోలేనా వీడికి అనుకోకండి). చుట్టూ పరికించి చూస్తె ఒకావిడ బండి మీద మిరపకాయ బజ్జీలు వేస్తూ కనిపించింది. వేడి వేడి బజ్జీలు చూడగానే లోపల ఉన్నా ఆత్మా రాముడు గట్టిగా విజిల్ వేసాడు.
         ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే ఆలు బజ్జి ఒక ప్లేట్ ఆర్డర్ చేశా. ఆ తరవాత బజ్జి, ఆ తరవాత మిరపకాయ బజ్జి, తరవాత ఒక ఎగ్గు బజ్జి. భయంకరంగా తిన్నాక ఎంతయింది అని అడిగాను. ముప్పయి రూపాయలు అన్నది ఆవిడ. అంతేనా? అప్పుడు ఆవిడ వంక చూసాను. కొంచెం పెద్దావిడే. నలబై ఉండవచ్చు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు నుంచి మొదలవుతుంది వీళ్ళ వ్యాపారం. బాగా ఎండగా ఉంది. కాని ఆవిడలో అలాంటి విసుగు, అలసట ఏమి కనిపించడం లేదు. ఎంత వోపిక ఆవిడకి?

      ఆవిడ ఒక్కతే కాదు. ఆ రోడ్డు లో చాల మంది నడి వయసు స్త్రీలు ఇదే చేస్తుంటారు. మన భారతీయ స్త్రీలకు ఇంట్లో ఉండే భాద్యతలు ఏమిటో అందరికి తెలుసు. అవన్నీ నిర్వర్తిన్చుకుని ఈ పని కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తారు? ఈ సంపాదనతో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించ గలుగుతారా? సగటు మనిషి అనుభవించే అన్ని సౌకర్యాలు అనుభవించ గలుగుతారా? వాళ్ళ తరవాతి తరం వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమయినా అభివృద్ధి చూడగాలుగుతారా?

          అసలు ఇదే నా మెయిన్ బ్లాగ్ టాపిక్. ఆవిడ ఇంటి అవసరాల కోసం ఎంత dedication చూపిస్తుంది. ofcourse అది అవసరం వలన వచ్చిన dedicatin కావచ్చు. కాని అలా కష్టపడే వారిని encourage చెయ్యాలి అని నాకనిపించింది. మనలో చాల మందికి ఏదో ఒక చారిటి Activity లో పాలుపంచుకోవాలని ఉంటుంది. ఇలాటి చిన్న వ్యాపారస్తులకి బిజినెస్ ఇవ్వడం కూడా నా ద్రుష్టి లో వారికి సహాయం పడటమే. కొంత మంది ఉంటారు, కూరగాయల బండి వాడి దగ్గర రూపాయ్ రూపాయ్ కి బేరం ఆడుతుంటారు. కాని సూపర్ బజార్ కి వెళ్లి వాడు ఎంత ఖరీదు చెప్పినా కిక్కురు మనకుండా ఇచ్చి వస్తారు.

            కష్టపడే వారు ఎవరైనా వారికి ఎదిగే హక్కు ఉంది. ఎదగాలని తాపత్రయ పడే వారికి చేయూత నివ్వడం కూడా మన బాధ్యత. కూరగాయల బండి నడిపే వ్యక్తీ కొడుకు కూడా అదే బండి నడపకూడదు.


            మనం వింటుంటాం Developed Countries , Developing Countries అని ఉంటాయి. India ఒక Developing Country. ఎన్నో సంవత్సరాలుగా Developing Country గానే ఉంది. అన్ని వర్గాల ఆర్ధిక ప్రమాణాలు సంతృప్తి కరంగా మారిన రోజున మనది కూడా Developed Country అవుతుంది (నాకు తెలిసిన ఎకనామిక్స్ ఇంతే). కాబట్టి చిన్న చిన్న వ్యాపారస్తులను ఆదుకుందాం. ఎందుకంటే....

"అందరు సుఖపడాలి నంద నందనా"