గతంలోకి జారిన.. ఓ.. స్నేహం.

తెల్లవారుజాము మూడుగంటలు కావొస్తుంది..
నైట్ షిఫ్టు లో ఉన్న నేను ఉలిక్కిపడ్డాను..
ఆఫీస్ షట్టర్ మీద ఎవరో కొడుతున్నారు...
"ఎవరూ" అని అడిగాను..
"నేను ప్రసాద్ ని.." అని వినిపించింది..
ప్రసాద్ మా ఆఫీస్ లో సేల్స్ చూస్తాడు..
సెక్యురిటి చేత షట్టర్ తీయించాను.. ప్రసాద్ అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నారు.. ఇద్దరికీ చమటలు పట్టి ఉన్నాయి..
ప్రసాద్ కంగారుగా లోపలి వచ్చాడు..
"ఎంటండి.. టైం లో వచ్చారు...?" మాటవరసకి అడిగాను...
"ఎం లేదు.. నాకు మన మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్ కావాలి.."
వెంటనే నా కార్డు మీద ఉన్న నెంబర్ తీసి చెప్పాను...
ఫోన్ డయిల్ చేస్తూ అన్నాడు..
"రంజిత్ కి ఆక్సిడెంట్ అయింది... కుమార్ కి కాలు ఫ్రాక్చుర్ అయింది.. హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను..."
షాక్..! ఒక్కసారిగా భయం వేసింది..
కూడబలుక్కుంటూ అడిగాను... "రంజిత్ కి ఎలా ఉంది?". రంజిత్ మా ఆఫీస్ లో HR
అతను కళ్ళు పైకేతి.. నా వైపు చూస్తూ చెప్పాడు... "రంజిత్ స్పాట్ లో ఔట్.."
మెదడు పని చెయ్యలేదు కాసేపు.. నా మొహం లో భావం లేదు...
అతను ఇన్సురెన్స్ వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు.. నాకేమీ వినిపించడం లేదు...
రంజిత్ అందరితో స్నేహంగా ఉండే వ్యక్తి.... రోజుకి ఒక్క సారయినా నాకు ఫోన్ చేసి "ఎం చేస్తున్నావ్ అని అడిగుతాడు". ఎవరితోను గొడవ పడే వ్యక్తీ కాదు... కాం.. గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయే మనిషి..
నిన్నగాక మొన్న వచ్చి నాతో పదినిమిషాలు మాట్లాడి వెళ్ళాడు... పైగా నా రూం పక్క రూమే అతనిది.. ఇప్పించిందికూడా నేనే..!
ఫోన్ లో మాట్లాడి హడావిడిగా.. వెళ్ళిపోతున్నాడు ప్రసాద్...
డిటైల్స్ అడగాలా వద్ద అనుకుంటూ "ఎలా జరిగింది...?" అన్నాను...
డివైడర్ కి గుద్దేశారు.. అని చెప్పేసి వెళ్ళిపోయాడు... అలాగే నిలబడ్డాను...
అంటే... ఇంకా రంజిత్ లెడా? నిన్నటి దాక నాతో మాట్లాడినతను.. రోజు లేడా? నమ్మశక్యం గా అనిపించలేదు... ఆఫీస్బయట మొన్న మేమిద్దరం నిలబడి మాట్లాడిన ప్రదేశం వైపు చూసాను... బాధగా అనిపించింది..
తప్పకుండా తాగుడు వల్లనే అయిఉంటుంది.... తగ్గించుకోమని చాలా సార్లు చెప్పాను..
ఎలా జరిగిందో కరక్టుగా...... నాకు తెలియదు.. ప్రసాద్ ని అడగలేకపోయాను.. అతను హడావిడిలో ఉన్నాడు..

ఉదయం ఐదు గంటలకల్లా.. ఆఫీసులో పని చేసే వాళ్ళందరికీ తెలిసిపోయింది.
మిగతా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను.. బాడి హాస్పిటల్ లో ఉంది, అందరు వెళ్తున్నారు అని తెలిసింది..
నేను మరొక సహోద్యోగి.. కలిసి ఆటోలో వెళ్ళాం...
"మార్చురీ వైపు వెళ్ళు" నాతో పాటు వచ్చినతను ఆటో అతనికి చెప్పాడు...
ఆటో దిగాం.. స్మశాన నిశ్శబ్దం లాంటిదేదో అక్కడ నిండి ఉంది..
దూరంగా ఎక్కడో ఏడుపులు వినిపిస్తున్నాయ్... అది వేరే వాళ్ళు అనుకుంటా..
మా ఆఫీస్ వాళ్ళందరూ ఉన్నారు అప్పటికే.. రంజిత్ వాళ్ళ తల్లితండ్రులు కూడా ఉన్నారు..
దూరం నుంచి చూసాను ... రంజిత్ వాళ్ళ అమ్మగారు అనుకుంటా కొంగు నోటికి అడ్డు పెట్టుకుని కుర్చుని ఉన్నారు..
కాని ఎవరు ఏడుస్తున్నట్టు అనిపించలేదు..
అందరు ఆక్సిడెంట్ ఎలా జరిగింది.. అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు...
మరొక సహోద్యోగి వచ్చి.. బాడీ లోపల ఉంది చూసి రండి అన్నాడు...
నాతో పాటు వచ్చినతను వేగంగా.. అడుగులు వేసాడు...నేను అతన్ని అనుసరించాను...
మార్చురీ ఎంట్రన్స్ దాక వచ్చాము... నా నడకలో వేగం తగ్గింది.. నేనెప్పుడు వెళ్ళలేదు మార్చురికి...
భయంగా అనిపించింది..
లోపలి వెళ్ళాం.. అంతా బాక్సులు బాక్సులు గా ఉంది గది.. ఎవరో ఒకతను వచ్చాడు...
" నంబరు.." అడిగాడు.. నాకు నోట మాటలేదు..
నాతో పాటు వచినవ్యక్తి..చెప్పాడు..
అతను బాక్సుని బయటకి లాగాడు...
అచేతనంగా.. రంజిత్.. ఎప్పుడు ఉండే చిరునవ్వు అతని మొహం మీద లేదు..
నేను ఒక అడుగు వెనక్కి వేసాను... నిజానికి చూడలేకపోయాను... తలకు బలమయిన గాయం అయింది..
తరవాత తదుపరి ప్రక్రియ కోసం రంజిత్ ని వేరే గదికి తీసుకెళ్ళారు... మమ్మలిని వేల్లిపోమ్మన్నారు..
మేము బయటకు వచ్చేసాం...
ఆలోచిస్తుంటే చాలా బాధగా.. అనిపించింది.. మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి... మంచి మనసున్న వ్యక్తి...
తాగుడు వ్యసనం వల్ల అర్ధంతరంగా.. అన్ని ముగుసిపోయాయి...
కొంచెం దూరం లో ఏడుపు వినిపించింది... రంజిత్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు..
పక్కన ఎవరో ఒదారుస్తున్నారు...
బాడిని వాన్ లో పెట్టె ముందు.. అందరిని చూడటానికి పిలిచారు...
వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకెళ్ళారు..
ఆవిడని ఆపడం ఎవరి తరము కాలేదు... ఏడుస్తూ ఏడుస్తూ ఆవిడా గొంతు బొంగురు పోయింది..
"నాన్నా..... ఎక్కుడున్నవురా..... ఒక్కసారి రా నాన్న...
కన్నా... ఒకసారి అమ్మా అని పిలవరా.. " వెక్కిళ్ళు పెడుతూ.. ఆమె కొడుకు కోసం పెద్దగా ఏడుస్తుంటే...
నా కళ్ల వెంట నీళ్ళు ఆగలేదు..
తరవాత రంజిత్ వాళ్ళ తండ్రి.. ఆయన్ని ముగ్గురు పట్టుకున్నారు.. "ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్.." నిలువునా కదిలిపోతూ.. ఏడుస్తున్నారు ఆయన!
ఆఖరికి వ్యాన్ లో పెట్టేసారు.. మరో వాహనం లో రంజిత్ వాళ్ళ తల్లితండ్రులు ఎక్కారు.. నా కల్ల ముందే వ్యాన్ అలావెళ్ళిపోయింది...
ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోయింది... ఇక నుంచి వ్యక్తీ ఉండదు..అతని గురించి మాటలు ఉండవు..
క్షణం నుంచి అతనో గతం..


కాని రంజిత్.. సాదించినది ఏంటి? ఇరవయ్ అయిదేళ్ళు చదివించి పెంచి పోషించిన తల్లి తండ్రులకు గర్బ శోకంమిగిలిచాడు... బహుశా అతను కూడా ఊహించి ఉండడు.. ఇలా జరుగుతుందని..
చిన్నా సరదా.. చిన్న నిర్లక్ష్యం.. చిన్న ఏమరిపాటు తనం.. కొందరి జీవితాలలో... అగాధం లాంటి చీకట్లనుమిగులుస్తాయి...
మదర్స్ ఢే రోజున కొడుకుగా రంజిత్ ఇచిన బహుమతి.. తల్లిని... భరింపరాని శోకం లో ముంచేసింది..

కారణం.. వ్యసనం.. తాగుడు..
రోజుల్లో మద్యం పుచుకునే వాళ్ళ శాతం ఎక్కువే...
కాని.. తాగి డ్రైవ్ చేయడం.. తాగి రోడ్ల మీద తిరగాలనుకోడం.. అంత శ్రేయస్కరం కాదు...
మనం అంటే.. మనమోక్కరిమే కాదు.. ఎన్నో బంధాలను కలుపుకుంటేనే.. మనం!
సరదా.. సరదాగానే ఉండాలి గాని... సరదా వ్యసనం కాకూడదు..
జీవితాలను ప్రస్నార్దాకం చేసే సరదా.. జీవితాలకు ముగింపు పలికే సరదాలు ఎందుకు?
మన మీద ఆధారపడిన వాళ్ళ కోసం అయినా సరే..
తస్మాత్ జాగ్రత్త!
____________________________
ప్రియ మిత్రుడు... ఎక్కడ ఉన్నా.. అతని ఆత్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
అతని స్నేహాన్ని.. అతని ఆత్మీయతని.. తలుచుకుంటూ.. .. పోస్ట్..