అందరు సుఖపడాలి నంద నందనా...

సమయం ఒంటిగంట దాటింది...
అలవాటు ప్రకారం కడుపులో రాట్ రేస్ మొదలయింది. చేసిన పని చాలు అనుకుని కీబోర్డ్ మీద WINDOWS + L కొట్టి లంచ్ కి ఉపక్రమించాను. అలా నడుచుకుంటూ డౌన్ ఫ్లోర్ లో ఉన్నా Cafeteria కి వెళ్లాను. ఫుల్ రష్ గా ఉంది. ఇంతలో మా కలిగ్ కనిపించి ఇద్దరికీ నాన్ మరియు ఆలు గోబీ ఆర్డర్ చేసింది. కాసేపటి ఎదురు చూపులు తరవాత రెండు ప్లేట్లు వచ్చాయి. ఇక అలా ఒక టేబుల్ చూసుకుని, పిచ్చా పాటి మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టాం.
           ఆలు గోబీ చేసినవాడికి బ్లడ్ ప్రషర్ సమస్య ఉన్నట్టు ఉంది, బొత్తిగా ఉప్పు కారం వేయలేదు. తప్పదు అన్నట్టు అలా తినడం మొదలుపెట్టాను. నా మొహం చూసి మా కలిగ్ అడిగింది..  "How is it?" అని. "Yaa Yaa... Good Good." అన్నాను ఇకిలించుకుంటూ. మొహామాటం కదా.. నచ్చలేదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు. అలా నాన్ రెండు ముక్కలు తిన్నాక..  నాన్ యొక్క భౌతిక స్థితి లో ఏదో మార్పు వచినట్టుంది. రెండు వేళ్ళతో త్రుంచడం అవ్వడం లేదు. సరే రెండో చెయ్యి కూడా పెట్టి త్రుంచి నోట్లో పెట్టుకున్నా. హావాయ్ చెప్పు ముక్క ఏదో నోట్లో పెట్టుకుని నవిలినట్టు అనిపించింది. ఈ రకంగా ఒక్కో ముక్క క్రష్ చేయడానికి నానా అవస్థా పడాల్సోస్తుంది. తిండి తినడానికి ఇన్ని కష్టాల? అవసరమా అనిపించింది..
        సో మిగతాది అలాగే వదిలేసా.. "Hey! Whaaat Haappen?" అంది మా కలిగ్. "Yaa! its OK. I am not much hungry" అని మళ్ళి ఇకిలించాను. అసంతృప్తిగా ముగిసిన లంచ్ బ్రేక్ తో మళ్ళి నా డెస్క్ చేరుకున్నా. 'డబ్బు పోయే శని పట్టే' అంటే ఇదేనేమో. ఈ సమస్య నాకేనా లేక అందరికినా? నాకు తెలిదు.

        సాయంత్రం ఇంటికి వెళ్తూ ఎమన్నా చిరుతిండి తిందామని రోడ్డు పక్కన ఆగాను (ఎప్పుడు తిండి గోలేనా వీడికి అనుకోకండి). చుట్టూ పరికించి చూస్తె ఒకావిడ బండి మీద మిరపకాయ బజ్జీలు వేస్తూ కనిపించింది. వేడి వేడి బజ్జీలు చూడగానే లోపల ఉన్నా ఆత్మా రాముడు గట్టిగా విజిల్ వేసాడు.
         ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే ఆలు బజ్జి ఒక ప్లేట్ ఆర్డర్ చేశా. ఆ తరవాత బజ్జి, ఆ తరవాత మిరపకాయ బజ్జి, తరవాత ఒక ఎగ్గు బజ్జి. భయంకరంగా తిన్నాక ఎంతయింది అని అడిగాను. ముప్పయి రూపాయలు అన్నది ఆవిడ. అంతేనా? అప్పుడు ఆవిడ వంక చూసాను. కొంచెం పెద్దావిడే. నలబై ఉండవచ్చు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు నుంచి మొదలవుతుంది వీళ్ళ వ్యాపారం. బాగా ఎండగా ఉంది. కాని ఆవిడలో అలాంటి విసుగు, అలసట ఏమి కనిపించడం లేదు. ఎంత వోపిక ఆవిడకి?

      ఆవిడ ఒక్కతే కాదు. ఆ రోడ్డు లో చాల మంది నడి వయసు స్త్రీలు ఇదే చేస్తుంటారు. మన భారతీయ స్త్రీలకు ఇంట్లో ఉండే భాద్యతలు ఏమిటో అందరికి తెలుసు. అవన్నీ నిర్వర్తిన్చుకుని ఈ పని కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తారు? ఈ సంపాదనతో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించ గలుగుతారా? సగటు మనిషి అనుభవించే అన్ని సౌకర్యాలు అనుభవించ గలుగుతారా? వాళ్ళ తరవాతి తరం వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏమయినా అభివృద్ధి చూడగాలుగుతారా?

          అసలు ఇదే నా మెయిన్ బ్లాగ్ టాపిక్. ఆవిడ ఇంటి అవసరాల కోసం ఎంత dedication చూపిస్తుంది. ofcourse అది అవసరం వలన వచ్చిన dedicatin కావచ్చు. కాని అలా కష్టపడే వారిని encourage చెయ్యాలి అని నాకనిపించింది. మనలో చాల మందికి ఏదో ఒక చారిటి Activity లో పాలుపంచుకోవాలని ఉంటుంది. ఇలాటి చిన్న వ్యాపారస్తులకి బిజినెస్ ఇవ్వడం కూడా నా ద్రుష్టి లో వారికి సహాయం పడటమే. కొంత మంది ఉంటారు, కూరగాయల బండి వాడి దగ్గర రూపాయ్ రూపాయ్ కి బేరం ఆడుతుంటారు. కాని సూపర్ బజార్ కి వెళ్లి వాడు ఎంత ఖరీదు చెప్పినా కిక్కురు మనకుండా ఇచ్చి వస్తారు.

            కష్టపడే వారు ఎవరైనా వారికి ఎదిగే హక్కు ఉంది. ఎదగాలని తాపత్రయ పడే వారికి చేయూత నివ్వడం కూడా మన బాధ్యత. కూరగాయల బండి నడిపే వ్యక్తీ కొడుకు కూడా అదే బండి నడపకూడదు.


            మనం వింటుంటాం Developed Countries , Developing Countries అని ఉంటాయి. India ఒక Developing Country. ఎన్నో సంవత్సరాలుగా Developing Country గానే ఉంది. అన్ని వర్గాల ఆర్ధిక ప్రమాణాలు సంతృప్తి కరంగా మారిన రోజున మనది కూడా Developed Country అవుతుంది (నాకు తెలిసిన ఎకనామిక్స్ ఇంతే). కాబట్టి చిన్న చిన్న వ్యాపారస్తులను ఆదుకుందాం. ఎందుకంటే....

"అందరు సుఖపడాలి నంద నందనా"