మీ ఇంటి తాళం చెవులు ఎవరికిస్తున్నారు?

ఎప్రిల్ 16, ఎంచక్కా ఆఫీసులకి సెలవు.. కాలేజులు ఉండవు. హాయిగా ఎటన్నా ఔటింగ్ కి వెళితే బాగుంటుంది కదు.
అన్నట్టు ఆ రొజు ఓటు వేయాలి కదా? ఆ అదేమీ పెద్ద విషయం కాదులె, మనం వేసినా వెయ్యాకపొయినా, గెలిచేవాడు గెలుస్తాడు, ఒడెవాడు ఒడ్తాడు.
పొనీ ఉన్న ఒటుహక్కుని వినియోగించుకుందామా? ఎవరికి వేయాలి? ఇదే ప్రశ్న మా ఆఫిసులొ ఒకరిని అడిగితె.. "యార్ కోయి భి జీత్నె దొ, కుచ్ ఫరక్ నయి పడ్తా.." అన్నాడు.. ఎవరొ ఒకరి పేరు చెప్పు వేసెస్తా అన్నాడు, మినపట్టు వేసినంత ఈజిగా..
ఎందుకనో జనాల్లొ అంత నిరాసక్తి..? ఎందుకని ఆ నిర్లిప్తత?
కారణం లేకపొలేదు లె..
ఎవడికి వొటేసినా దోచుకు తినేవాడె.. అలాంటప్పుడు.. ఎవడికి వేస్తె ఎంటి.. వెయకపొతె ఎంటి?
కొట్లకి కొట్లు పొసి టిక్కెట్టు కొనుక్కుంటున్నారు.. కొటి నుంచి పది కొట్ల దాక పలికిందట.. ఒక్కొ టిక్కెట్టు..
అంటే... ఉదాహరణకి.. అయిదు కొట్ల పెట్టి టిక్కెట్టు కొన్నాడు అనుకుందాం.. అంటె... అతను రానున్న అయిదు సంవత్సరాలలొ.. ఎన్ని కొట్ల ఆదాయాన్ని అంచనా వేసి ఉంటాడు..? ఓ.. యాబై లేక వంద దాక వేసి ఉంటాడు కదా..?
దీన్ని ప్రజాసేవ అంటారా లేక వ్యాపారం అంటారా?
నామినెషన్ ఫారం నింపి సరిగా సంతకం చేయడం రాని చవట దద్దమ్మలు.. మనల్ని ప్రజారంజకం గా పాలిస్తారా?
మొన్న పేపరులొ చూశా.. అతగాడు నామినెషన్ ఫారంలొ సంతకం పెట్టడం మర్చిపొవడంతొ, నిరాకరించారంట...
గొల్లుమంటున్నాడు... డబ్బులతొ కొన్న టిక్కెట్టు పొయె.. పొటిలొ నుంచి బయటికి పొయె.. జీవితమే.. ఇరుకున పడిపాయె... నిజం చెప్పొద్దు.. నాకు చెప్పలెని నవ్వు వచ్చింది...
విచిత్రం ఎమిటంటె.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న.. కెవలం దొచుకొడానికె రాజకీయల్లొకి వచిన ఈ రాజకీయనాయుకులు.. ఎంతొ మేదస్సు కలిగిన, అయర్నిశలు శ్రమించి ఉన్నత స్తాయికి చెరుకున్న I.A.S, I.P.S లను శాసించడం..
ఇలాంటి పరిస్తితికి కారణం ఎమిటి? ఎందుకు ఇలాంటి అనర్హులకి పదవులు చిక్కుతున్నాయి? కారణం ఎవరు?
ఇంకెవరు మనమె...! అవును ముమ్మాటికి మనమె... మన ఒటు హక్కుని మనం సరిగా వినియొగించకపొవడమే..
వాడు దొంగ అని తెలుసు... అయినా వాడికే ఇంటి తాళాలు ఇస్తాం మనం..
కొంతమంది మహనుభావులు ఉన్నారు.. వారం రొజుల పాటు దొరికె మద్యానికి, రొక్కానికి.. అయిదేళ్ళు తాకట్టు పెట్టేస్తుంటారు..
తన కొన్నాళ్ళ విలాసానికి... తన భార్యబిడ్డల భవిష్యత్తుని దీర్ఘకాలనికి నడిరొడ్డున పడేస్తున్నాడని అతనికి తెలిసేదెప్పుడొ..
మరి ఇలాంటి రాజకీయ పరిస్థుతుల మద్య వొటు వెయ్యలా? అని అంటే...
సమాధానం..
.........
.........
వెయ్యాలి..!
ఎందుకని?
ఎందుకంటె.. నేను వొటు మాత్రమె వేయడం లేదు... నేను నా అయిదు సంవత్సరాల.. భవిష్యత్తుని ఎంచుకుంటున్నాను..
నాతొ పాటు.. నా స్నేహుతులు.. నా బందువులు.. నా చుట్టు.. ఉన్న అత్మీయులు.. అందరు సౌకర్యం గా భావించె ఒక అరొగ్యకరమయిన వాతావరణాన్ని కొరుకుంటున్నాను...
ప్రతి మనిషి తన హక్కులను తాను దైర్యంగా వినియొగించుకునే.. పరిపూర్న స్వాతంత్ర దేశాన్ని కొరుకుంటున్నాను...
విద్య, వైద్యం, నివాసం.. లాంటి కనీస అవసరాలు తీర్చె ప్రజానాయకులను కొరుంటున్నాను...
అవినీతిలేని నిష్కల్మష సమాజాన్ని కొరుకుంటున్నాను... నా చిన్నతనంలొ కాస్త్ట్ సర్టిఫికెట్ తీసుకున్న ప్రతిసారి.. 20 నుంచి 50/- వరకు లంచం ఇవ్వడం నాకు బాగ గుర్తుంది.. నా పదవ తరగతి చదవడనికి నాకు 50/- ఖర్చు అయితె.. ఈ లంచాలకి ఒ 200/- అయిఉంటుంది..
ఎ పాలన వచ్చినా.. ఎందరు పాలకులు మారిన.. పేదవాడి పరిస్తితిలొ మార్పు రాలేదు.. అదె అదాయం.. అదె కాయకష్టం.. అదె గూడ్సుబండి బ్రతుకు.. ఆగదు.. సాగదు..
మరి ఉద్దరించేవాడు ఎవడు..? పరిష్కారం ఎమిటి?
నెనొకటి సూచిస్తాను... దాని పేరే..
లొక్ సత్తా.. జయ ప్రకాష్ నారయణ..
ఎవరీయన? నాక్కూడా పెద్ద తెలియదు... కాని తెలుసుకున్నాను..
ఒక మాములు మనిషి.. గ్రామంలొ పుట్టి పెరిగి.. ఉన్నత స్థాయికి చెరుకున్న విఙ్ఞాని.
మొదలు ఒక డాక్టరుగా.... తరవత I.A.S అధికారిగా... నేడు రాజకీయవేత్తగా... అయన పయనం సుధీర్గమయినది..
అయన I.A.S అధికారిగా ఉన్నప్పుడు.. ప్రజలకి ఎప్పుడు అందుబాటులొ ఉండెవారని.. ఎ సమయంలొ అయినా, ఎ పరిస్తితిలొ అయినా సమస్యని సాదించడంలొ ముందుండేవారని చెబుతుంటారు...
ప్రస్తుత రాష్త్ర, దేశ, ప్రపంచ సామజిక, అర్ధిక పరిస్తుతులపై అయన విశ్లెషణ అమొఘం..
లొక్ సత్తా కే ఎందుకు వొటెయ్యలి?

* జె.పి గారి గురించి ఫలనా రాజకీయనాయకుడు వెలెత్తి చూపించదం, బురద చల్లడం నెను చూడలెదు.
* లొక్ సత్తా పార్టిలొ.. రౌడిలు, గూండాలు లేరు... ఉన్నవాళ్ళందరు.. ప్రజా సంక్షేమం కొరుకునే యువజనం..
* అడ్మినిస్త్రషన్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి జె.పి.
* అవినీతి నిర్మూలన, పూర్తి ఉచిత వైద్యం, కుల ప్రాతిపదికన రిజర్వెషన్లను నియంత్రించడం, వ్యవసయ రంగం లొ నూతన ప్రణాలికలు లాంటి ప్రదానమయిన అంశాలు కలిగి ఉందటం..
నేను చెప్పెదానికంటె...
ఆయన మాటల్లొనె.. వినండి... ఈ క్రింది లింకు క్లిక్ చెయండి...


All Educated Communities are turning towards Loksatta... But the message is not reaching to illiterates and villages.
Spread About LokSatta.
Dream for a Better Future.

7 comments:

  1. బాగా చెప్పావ్ పారదు...
    నా ఓటు కుడా లోక్ సత్తా కే...

    కాని కొంత మంది వాదన ఏంటంటే... లోక్ సత్తా లో JP తప్ప ఇంకొకరు తెలీదు మనకి... మన నియోజకవర్గంలో నిలుచునే లోక్ సత్తా కాండిడేట్ ఎవరో తెలీదు... మరి అలాంటప్పుడు JP ని చూసి ముక్కు మొహం తెలియని మనిషికి ఓటు వేయటం ఎలా... అని అంటున్నారు!

    ReplyDelete
  2. నేనూ లోక్‌సత్తాకే వేస్తున్నానండి.

    ReplyDelete
  3. తెలియక పోవడానికి ఇంకొక కారణం కూడా ఉండొచ్చు చైతన్య గారూ! ఎందుకంటే వీళ్ళంతా యుగాల తరబడి రాజ్యాల్ని ఏలుతున్న నాయకులు కాదు, మీలాంటి మనలాంటి సామాన్యులు కావచ్చు. మనలాగే ఏదో సాధిద్దామని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు.మన మీడియా వీళ్ళ గురించి ఏమీ చెప్పదు. సో మనకీ తెలిసే ఛాన్స్ లేదు.

    ReplyDelete
  4. వాళ్ళు కూడా JP ని చూసి వచ్చిన వాళ్ళే.

    ReplyDelete
  5. హ హ..
    ఒక చెడ్డ పని చేస్తే వచ్చే గుర్తింపు, ఒక మంచి పని చేస్తే రాదులె.
    అందుకే జె.పి సామాన్య ప్రజానికానికి చెరువ కాలెదు..
    కాని .. కొంచెం ఆలస్యమయినా నిజం ప్రజల్ని చేరుతుంది.

    ReplyDelete
  6. Pardhu gaaru, chaala manchi post. Nenu votu veyadam kudaradu, kaani maa parents ni ma in-laws ni Lok sattake vote vesatattu pursue chesanu. prajalu Kula rajakiyalu okka kshanam pakkana petti vivekamtoti aalochiste enta bavuntdi. JP garu cheppinattu, this is our second and true fight for independence, the independence from from factionism, independence from corruption, independce from nepotism, independence from oppression. ENOUGH IS ENOUGH

    ReplyDelete

మరి మీరేమంటారు?