ప్రేమలో ఉండగా మరొకరు ఆకర్షిస్తే..

మనిషికి ఎన్నో కోరికలు..
తనకేం కావాలో తనకే తెలియదు.. దక్కినవి నచ్చవు, దక్కనివాటి కోసం ఆరాటం ఆగదు.
ఈ మానసిక అసమతుల్యంలో.. అతని చర్యలేమిటో అతనికే అంతుచిక్కదు...
తొందరపాటు తనంలో తీసుకునే నిర్ణయాలకి భావిష్యతులో మూల్యం చెల్లించవలసి వస్తుంది.




ఈ రోజు విన్న ఒక సంఘటన.. ఈ పుట రాసేలా చేసింది నన్ను.
ప్రేమలో ఉండగా మనసు మరో వైపు మల్లుతుందా?
అవును, కొన్ని సందర్బాలలో జరుగుతుంది. అది కూడా చాల సహజంగా. తప్పు అని కూడా చెప్పలేని విధంగా..


ఉదాహరణకు... కాలేజి రోజుల్లో ప్రేమలు ఎక్కువగా అందానికి, ఆకర్షణకు కొన్ని కొన్ని సార్లు ఏ కారణం లేకుండా కూడా మొదలవడం మనం చూస్తుంటాం. ఈ రోజుల్లో ఇవి మరీ ఎక్కువ కదా?


అయితే.. ఎప్పుడయితే మనిషిలో (ఆడ అయినా మగ అయినా) మెచ్చ్యురిటి లేదా మెరుగయిన ఆలోచనా విధానం మొదలువుతుందో, అప్పుడు తన ఆలోచనలు పూర్తీగ మారడం జరగోచ్చు.  అప్పుడు తన జీవిత బాగస్వామి పట్ల తనకి ఉన్నా Requirements మొత్తం కొత్తవి రావొచ్చు.


ఒకప్పుడు రఫ్ గా ఉండి అందరిని బయపెట్టే మనిషి పట్ల crazy గా అనిపించిన అమ్మాయికి, పరిణితి వచ్చాక.. మృధుస్వభావి, వినయవిదేతలు కలిగిన మనిషితో జీవితం ఆహ్లాదంగా ఉంటుంది అనే ఆలోచనా వస్తే..?


ఒకప్పుడు.. అందంగా గర్వంగా ఉండే అమ్మాయిని సత్యభామ తో పోల్చుకుని మురిసిపోతే.. ఉద్యోగంలో చేరి నిజ జీవితపు ఒడి దుడుకులు చూసాక, తనని అర్ధం చేసుకుని కష్ట సుఖాలలో కాస్త ఊరటగా ఉండే అమ్మాయి.. నలుగురికి మంచి చేసే అమ్మాయి పట్ల ఆరాధన భావం పెంచుకుంటే.. మొదటి అమ్మాయితో జీవితం దుర్బరం అవుతుంది అన్న నిర్ణయానికి వస్తే?


ఎం చేయాలి?


సహజంగా ఎం చేస్తుంటారు?
కొంతమంది తప్పదు తల రాత అని కంటిన్యు అయిపోతారు..
కొందరు ఎలా చెప్పాలో తెలియక మెల్లగా మాట్లాడటం తగ్గిస్తారు. కాని అవతల వారికి ఎం జరిగిందో అర్ధం కాక పిచ్చి ఎక్కుతుంటుంది.
కొందరు ఏ నిర్ణయం తీసుకోరు.. రెండు relations ఒకేసారి నడిపిస్తుంటారు. ఇది చాల ప్రమాదం, ఈ కేసు లో చివరికి ఏ మంచి జరగదు.
ఇక పోతే మరికొందరు.. ఎవరో ఒకరిని స్నేహితులుగా మార్చుకుంటారు.


పైన చెప్పిన వాటిలో మీరు దేన్నీ సమర్దిస్తారు?
సరే అది పక్కన పెడదాం..


ఇదే విషయాన్ని మరొక కోణంలో చూద్దాం.
ప్రేమించిన వ్యక్తి మరొకరితో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసినప్పుడు ఎం చేయాలి?


కొందరు పిచ్చికోపంతో ఊగిపోతారు.. మరి కొందరు మగవారు ఉన్మాదిలాగా మారి రాక్షసత్వం చూపిస్తారు.
కొందరు జీవితం మొత్తం కోల్పోయామనే భావనతో total గా డిప్రేస్స్ అయిపోయి తాగుబోతులు అవుతుంటారు.
కొందరు కుమిలి కుమిలి ఏడ్చి కొన్నాళ్ళకు మాములుగా అవుతారు.
కొందరు బలహీనమయిన మనస్తత్వం కలవారు జీవితాన్ని అంతం చేసుకుంటారు. (ఇది అతి పెద్ద మూర్కపు పని)


దీనిలో మీరు దేనిని సమర్దిస్తారు?


సరే నేను విన్న సంఘటన దగ్గరకు వస్తే..
ఒక అమ్మాయి రెండో వ్యక్తి ని ఇష్టపడి, ఇద్దరితో సమానంగా ఉండటం జరిగింది..
ఆ తర్వాత ఈ ఇద్దరు కుర్రాళ్ళు గొడవపడటం వలన మొదటి వ్యక్తీ ప్రాణాలు కోల్పోయారు.




ఇక్కడ ఎవరిది తప్పు?
కచ్చితంగా మీరు వోప్పుకుంటారు. అమ్మాయిది అని.
కాని ఆ అమ్మాయి ఎం చేసి ఉండాల్సింది. మొదటి వ్యక్తి కి అర్ధమయ్యేలా చెప్పాల్సింది. అది అంత సులువు కాదు. కొంచెం కష్టమే.. కాని ప్రాణాలు పోయే అంత కష్టం మాత్రం కాదు కదా? ఒక మాట చెప్పేసి ఉంటే ఎలా ఉండేది? కాని తను బయపడి ఉంటుంది.
ఒక వేళ చెప్తే.. తను పాజిటివ్ గా తీసుకుంటాడో లేదో అని అలోచించి ఉండొచ్చు. కాని ఈ కన్ఫ్యూజన్ ఖరీదు ఒక ప్రాణం.






మరేం చేయాలి?
మనసు విప్పి మాట్లాడుకోడమే మిగిలి ఉన్నా ఒకే ఒక మార్గం.
అర్ధమయ్యేలా చెప్పి, అతను లేక ఆమె అంగీకారం తీసుకోడం చాల అవసరం. రెండో వ్యక్తీకి ని కూడా ఇందులో involove చేయడం మంచిది. ఒక మంచి understanding తో స్నేహుతులుగా మారే అవకాసం ఉంటుంది.






అలా చెప్పినప్పుడు అంగీకరించే సహృదయం రెండో వ్యక్తీ (విడిపోయే వ్యక్తి) ఉండాలి. కాలం మారుతుంది. కాలంతో పాటు ఆలోచనలు, భావాలు మారాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేమించడం అంటే.. వారి క్షేమం కోరోకోడమే..  వారు సంతోషం గా లేకుండా కలిసి ఉంటే.. అది ఒక మంచి సంబంధం అనిపించుకోదు. అయినా ఒకసారి వారి మనసు మారిన తరువాత తిరిగి మార్చాలనుకోడం అంత సబబు కాదు.




చివరిగా ఒక మాట. ఒకరిని భ్రమలో ఉంచి, మరొకరితో advance అవడం మాత్రం చాలా చాలా పెద్ద పొరపాటు. ఏదయినా Frank  గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా, నిజాన్ని నిర్బయంగా చెప్పాలి. "ప్రేమ జీవితాలని నిలుపుతుంది. మరో కోణంలో జీవితాలతో ఆడుకుంటుంది. జీవితాలను అంతం చేస్తుంది."




ఇప్పుడు ఇదంతా చదివి అందరు ప్రభావితం అయిపోయి.. పార్టీలు మార్చేయాలని కాదు. ఒక్కోసారి అది పెద్ద పొరపాటు కూడా అవుతుంది. ప్రేమించిన వారిని వదిలేసి తప్పుడు త్రోవలో పడటం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదయినా బాగా అలోచించి నిర్ణయం తీసుకోడం అవసరం.


"నిజమయిన ప్రేమను త్రుంచాలనుకోడం మూర్కత్వం."

7 comments:

  1. idi chadivaka naaku konchem depression taggindi....thanks

    ReplyDelete
  2. good one anDi, chala baga chepparu.

    ReplyDelete
  3. hi andi na peru priya, meeru chala correct ga rasaru. idi choosi ammayilu confusion lo undakunda edo oka correct nirnayam teeskuntaru, good job.

    ReplyDelete
  4. విమర్సలకు ధన్యవాదాలు.
    మంజు గారు.
    లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

    హను గారు.
    థాంక్స్

    చైతన్య గారు
    నేను రాసిన దానికి మీరు రాసిన దానికి సంబంధం లేదు. మీ టాపిక్ వేరే, నా టాపిక్ వేరే. నేను రెండో మనిషి మీద రెండో సారి ప్రేమ పుట్టినప్పుడు అని మొదలుపెట్టాను. కచ్చితంగా ప్రేమే.. ప్రేమ లాంటి స్నేహం కాదు.
    మరొక విషయం.. నేను ఆడవారి గురించే రాయలేదు, జెనరల్ గా రాసాను.

    ప్రియ, ప్రియ దర్శిని..
    థాంక్స్ అండి.

    ReplyDelete
  5. నిరంతరం చర్చలో వుండవలసిన సున్నితమైన సబ్జెక్ట్ యిది. మంచి ప్రయత్నం. మీరు చెప్పాలనుకున్న అభిప్రాయమో ,మీ మనసులో వున్న సందేహమో ప్రస్ఫుటంగా వెలికి రాలేదనిపిస్తోంది. విస్త్రుత కోణాల్లో ద్రుస్యించి మరీ మరల ప్రయత్నించండి. అభినందనలతో.....శ్రేయోభిలాషి...నూతక్కి

    ReplyDelete
  6. "దక్కినవి నచ్చవు, దక్కని వాటి కోసం ఆరాటం ఆగదు."

    Sreeeee గారూ... చాలా బాగా చెప్పారు. మనిషి.. మనస్తత్వాలు ఇలా ఎందుకు ఏర్పడుతున్నాయో నాకూ అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి కన్ఫ్యూజన్ని బాగా వివరించారు.

    నిజమే ఎవరివైనా ఈ వేళ ఉన్న అభిప్రాయాలు రేపు ఉండకపోవచ్చు. సమస్య శాశ్వతం కాదు. మాటలతో తీరని సమస్యంటూ నాకు తెలిసీ ఈ ప్రపంచంలో ఉండదు. ఏది ఏమైనా ప్రాణం తీసుకోవడం జీవితానికి, సమస్యకీ.. పరిష్కారం కాదు.

    I appreciate your sensible mentalty. Keep it up.

    ReplyDelete
  7. @నూతక్కి గారు
    సలహాకు కృతజ్ఞతలు. మీరన్నట్టు విశ్లేషించి రాయాలంటే గ్రంధమే అవుతుంది. కాని మీ సలహాను తప్పక పరిగిణలోకి తీసుకుంటాను.

    @గీతిక గారు
    థాంక్స్ అండి.

    ReplyDelete

మరి మీరేమంటారు?