పార్ధు: నన్నెవరూ డిస్టర్బ్ చెయ్యొద్దు.
జనాలు: నిన్నా? మాకు వేరె పని లేదనుకుంటున్నావా?
పార్ధు: సీరియస్ గా ఎమన్నా రాద్దామనుకుంటున్నా...
జనాలు: అమ్మొ! వీడు మళ్లి ఎదొ బుర్ర తినే కార్యక్రమమ్ పెట్టినట్టున్నాడు రా..
పార్ధు: హుమ్ మ్ మ్.... మనిషి పుట్టాడు...
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: మనిషి పెరిగాడు..
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: మనిషి పొయాడు.
జనాలు: వాహ్ వా! వహ్ వా!
పార్ధు: అసలు ఎందుకు పుట్టాలి? ఎందుకు పొవాలి?
జనాలు: ఒరెయ్! మమ్మల్ని వదిలెయ్యరా బాబు.
పార్ధు: చ! ఈ జనాలకి బొత్తిగా టేస్ట్ లేదు.
బై ద వె.. అందరికి దండాలండి.. నా పేరు పార్ధు.
అసలు పేరు పార్ధ సారధి. కూతంత ఇస్టయిల్ గా ఉంటదని అలా చెప్పుకుంటుంటాను.
అందులొ...ఆ మధ్య "అతడు" సినిమా పుణ్యమా అని నా పేరు బాగా పాపులర్ అయింది. (తొక్కలొది... నన్ను అడక్కుండా నా పేరు పెట్టుకున్నారు )
జనాలు: వీడి సొది తగలెయ్యా!
పార్ధు: నా గురించి చెప్పాలంటె... చాలా కష్టమ్. ఎందుకంటే చెప్పుకొడానికి ఎమి లేదు కాబట్టి.
నాలొ నాకు నచ్చేవి రెండే రెండు... ఒకటి నా పేరు. రెండు నా మాట.
జనాలు: సెల్ఫ్ డబ్బా చాలురా ఒరెయ్...
పార్ధు: బెసిక్ గా జనాలు ఎమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకొను.. యట్ ద సెమ్ టైమ్ విమర్సించను.. నా దారి నాదె.
జనాలు: రహదారి ఎం కాదు?
పార్ధు: చి!! ఈ జనాలకి అసూయ నేనంటె. వాళ్ళని పట్టించుకొకండి మీరు.
అసలు అసూయ ఒకటే కాదు.. ఈ జనాలకి చాలా యదవ లక్షణాలు ఉన్నాయ్.
కుల పిచ్చ, మత పిచ్చ...అవును నిజం.
ఆశ్చర్యం ఏంటంటే.. రేపటి తరాన్ని పాలించబొయే.. యువత లొ కూడా ఇదే పిచ్చ..
ఏమిటీ కులం?
మంచి,చెడు కులం తొ నిర్ణయించబడుతుందా?
ఒక కులం లొ ఉన్న ప్రతి వారు ఉత్తమోత్తములు అని చెప్పగలమా?
నిన్నటి తరం చాదస్తం లొ ఉంది అనుకుంటే.. నేటి తరం పూర్తిగా మతి భ్రమించి ఉంది.. కాలేజిల్లొ, పెద్ద పెద్ద యూనివర్సిటి ల్లొ కులం పేరు తొ వర్గీకరణ..
నాకనిపిస్తుంది మతం కంటె కులం చెడ్డది. మతం దేశాలని విడదీస్తె.. కులం వీది వీది ని విడదీస్తుంది..
"కొనవూపిరి తొ ఉన్నప్పుడు.. రక్తమిచ్చేవాడిని అడుగుతామా 'నీ కులం ఏంటి? అని" అప్పుడేమయింది.. కాస్ట్ ఫీలింగ్?
ఒహ్హ్ ప్రాణమే పొయాక తొక్కలొ కులం ఎక్కడుంటుంది అన్న భయమా?
Dear Friend..
లోకం లొ ఉన్నవి రెండే కులాలు ఒకటి 'మంచి ' రెండు 'చెడు ' .
మతం పేరు తొ రాజకీయం చేసి వొట్లు దండుకునె.. అవకాశవాదుల.. మాటలు విని మొసపొకు... అవన్ని పదవుల కొసం చెసే ఫీట్ లు.
కులం పేరు తొ కంచెలు వేసుకోకు.. చేయి అందించు.. స్నేహాన్ని పంచు.. ప్రశాంత జీవితాన్ని అనుభవించు, భావితరాలకి అందించు..
హా.... నీరసమొచ్చింది..
Emotion ఎక్కువయినట్టు ఉంది..
అన్నట్టు ఈ జనాలు ఏరి? హి హి జంపు జనార్దన్ అనుకుంటా...
అన్నయ్యా!!
ReplyDeleteపొద్దున్నే ఎందుకు నన్నేడిపించావ్? ఎళ్ళి మొహం కడుక్కొస్తా.
చీరేశావ్ అన్నయ్యా!! చీల్చి ఛెండాడావ్.
ఇలా రాస్తూనే ఉండు.
బాగుందండి. మీరు గీసిన యం.యస్. సుబ్బులక్ష్మి గారి చిత్రం చూశానండి. చాలా బాగుంది.
ReplyDeleteదయచేసి word verification తీసివేయగలరు.ఒకవేళ ఎలా తీయాలో మీకు తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
పార్ధు గారు,
ReplyDeleteమీ అవేదన పిచ్చ..జనాలు అర్ధం చేసుకొకపొయనా మన బ్లాగర్ మిత్రులు అర్ధం చేసుకొంటారు లెండి.మంచి టాపిక్ తొ వచ్చారు.అబినందనలు.
ఆదిత్య.
You have choosen important subject.
ReplyDeleteThe "caste" is the basis for many things in our society. Caste base marriages, Caste based schools, Caste base politics etc.