అమ్మాయి!..........జాగ్రత్త



ముఖేశ్.

ముఖేశ్ తాపీగా బెడ్ మీద పొడుకుని, తన మొబైల్ తీసుకుని ఒక నంబర్ డయల్ చేసాడు. ఆ నంబర్ కాల్ సెంటర్ లొ వర్క్ చేస్తున్న గీతది. నెల రోజుల క్రితం అఙ్ఞాతవ్యక్తిలా కాల్ చేసి మెల్లగా పరిచయం పెంచుకున్నాడు ముఖేశ్. సరెలే ఎదొ టైంపాస్ కె కదా అని గీత కూడా మాములుగా మాట్లడటం స్టార్ట్ చేసింది.

"హాయ్ గీత ఎలా ఉన్నావ్?" సహజం గా ముఖేశ్ కంఠం చాల మ్రుదువుగా ఉంటుంది.
"బాగున్నాను."
"నిన్ననే మాట్లాడానా.. ఎంటొ చాలా రొజులు అయినట్టుగా ఉంది గీతు" ఇలా ముద్దుగా పిలవడం ముఖేశ్ కి వెన్నతొ పెట్టిన విద్య.
"అవునా!" ముఖ్తసరిగా అన్నది గీత.
"నిన్న వర్షం పడింది కదా?" అడిగాడు ముఖేశ్.
"అవును ఎ?"
"అప్పుడు నేను మా విండొ దగ్గరకి వెళ్ళి నుంచొన్నా.. అప్పుడు నా మీద వాన చినుకులు పడుతుంటే.. నిజం చెప్పనా గీతు.. ప్రతి చుక్కలొనూ నువ్వె. నువ్వే చినుకులుగా మారి నా పడుతున్న ఫీలింగ్.."
ఇలా మాట్లాడటం ముఖేశ్ కి కొత్త కాదు..
కాని గీతకి ఇవన్ని ఎప్పుడు వినని మాటలు.
అప్రయత్నంగా "నిజమా?" అన్నది.
ఆ మాత్రం రెస్పాన్స్ చాలు ముఖేశ్ కి "నిజంగా! ఇంతకమునుపు ఎన్నడు ఇలాటి ఫీలింగ్ రాలేదు నాకు."
అతని భావ వ్యక్తీకరణ కి ముగ్దురాలయింది గీత.
"ఒకటి అడగనా?" అభ్యర్దనగా అడిగాడు ముఖేశ్
"అడుగు"
"రేపు ఆదివారం కదా... నేను నిన్ను కలవచ్చా? జస్ట్ ఊరికే.. ఒకసారి చూడాలని ఉంది"
ఎందుకొ వద్దనలేకపొయింది గీత.
ఆ తరవాత గీత అతనిని కలవడం.. అతని మాయలొ పడటం..
కొన్నాళ్ళకి అతని నిజ స్వరూపం తెలియడం, కుమిలి కుమిలి ఎడ్చి మళ్ళి మెల్లగా తన దైనందిన జీవితంలొ పడటం..
వరసగా జరిగిపొయాయి.
- - - - - - - - -
ప్రభాకర్.

నెట్ వర్క్ కాన్సెప్ట్స్ మరియు హాకింగ్ పైన మంచి పట్టు ఉన్న వ్యక్తి.
ఆన్ లైన్ లొ మొదట మంచితనం చూపించి అవతలి వ్యక్తుల ఉనికిని పసిగట్టడం, వారి వెబ్ కాం లను హాక్ చేసి రికార్డ్ చేయడం,
ఆడపిల్ల లతొ చాట్ చెసి, విలాస వంతమయిన జీవన విదానం, బైక్ రైడింగ్ లు, మొడర్న్ కల్చర్ లాంటి మాటలు చెప్పి అమాయకులయిన ఆడపిల్లల్ని లొబరుచుకుని అవసరమయితె బ్లాక్ మెయిల్ చేసి తన అవసరాలు తీర్చుకొడం ఇతని అలవాటు.
- - - - - - - - -
వంశీ.

మంచి అందగాడు. గర్ల్స్ కాలేజెస్ దగ్గర ఉదయం,సాయంత్రం కనబడుతుంటాడు. ఒక అమ్మాయిని టార్గెట్ చేసి, ఆమె కాలెజ్, టుషన్స్ వెళ్ళే టైమింగ్స్ తెలుసుకుని, రొజూ ఆమె కంటపడుతూ,చిరునవ్వు నవ్వుతూ ఇంప్రెస్స్ చెయ్యడం, చాన్స్ రాగనె ఒక గులాబి ఇవ్వడం ఇతనికి అలవాటు.
పోతె ఒక రుపాయి గులాబి పొతుంది, పడితె అమ్మాయి పడుతుంది ఇది అతని పాలసి.
ఇతని బారిన పడిన ఆడపిల్లల సంఖ్య తక్కువేమి కాదు.

- - - - - - - - -

ఇలా చెప్పుకుంటూ పోతె ఇటువంటి వారి లిస్ట్ కి అంతమే లేదు.
పైన చెప్పినవన్ని ఏ పుస్తకం లొనో చదివిన కధలు కాదు. టి.వి. సీరియల్స్ అంతకన్నా కాదు. కళ్ళముందు సొసైటి లొ జరుగుతున్న సత్యాలు.
ఇంతే కాదు..
ఆడపిల్లల చేత ఫొన్లొ సరసంగా మాట్లాడిస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి ఫ్రెండ్స్ కి వినిపించెవాళ్ళు..
రికార్డ్ చేసి నెట్ లొ అప్ లొడ్ చెసేవాళ్ళు.
ఫొటొ లు మార్ఫ్ చేసి ఫేక్ ప్రొఫయిల్స్ క్రియేట్ చెసేవాళ్ళు.
ఆడపిల్లల నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు.
ఈ రకంగా వికృతమయిన ఆలొచనలు ఉన్న జనాలు సమాజంలొ చాలానె ఉన్నారు.
ఇప్పుడు మొసగాళ్ళకి టాలెంట్ చాలా ఎక్కువ..
పొయిటిక్ గా మాట్లాడటం తెలుసు. రంగుల ప్రపంచం చూపించడం తెలుసు. "ఎరా, బుజ్జి, బంగారం, కన్నా" అంటూ బుజ్జగిస్తూ బుట్టలొ వేసుకొడం తెలుసు.
మరి ఎలా?
ఎవరు జెన్యున్? ఎవరు చీటర్?
ఎలా పసిగట్టాలి?

- తక్కువ పరిచయంలొ ఎక్కువ అభిమానం, అతి ప్రేమ కురిపించే మాటలు మాట్లాడే వారిని నమ్మొద్దు.
- చాట్ లొ, ఆన్ లైన్ ఫొరమ్స్ లొ పరిచయమయిన వాళ్ళతొ మీ పర్సనల్ విషయలు పంచుకొవద్దు, ఫోటొలు పంపొద్దు, అంతగా ఫొటొ చూపించాలి అంటె
ప్రొఫైల్ డిస్ప్లె లొ పెట్టి చూపించండి.
- తెలియని వాళ్ళని మీ చాట్ లిస్ట్ లొయాడ్ చేసుకోవద్దు, ఒక వేళ అతను హాకర్ అయితే మీ గురించి అంతా తెలుసుకొగలడు.
- రోజుల పరిచయానికి "అమ్మ, బంగారం, బుజ్జి, కన్నా" అని సంబొదిస్తుంటే, అతను మిమ్మల్ని పడెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని అర్దం.
- ఒక కొత్త వ్యక్తి ని కలిసెటప్పుడు, కేవలం ఒక మీట్ తొ అతని గురించి ఒక అవగాహన కి రావద్దు. మొదటి సారి ఎవరయినా డీసెంట్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
- ఒక వేళ మీరు మొదటి సారి ఒక చాట్ ఫ్రెండ్ ని కలుస్తున్నట్లయితె.. మీటింగ్ పాయింట్ గా నిర్జన ప్రదెశాలను ఎంచుకొవద్దు.
- ఫొన్ లొ మాట్లాడే టప్పుడు.. మీకు ఎదయినా బీప్ సౌండ్ వస్తుంటే.. అవతలి వాళ్ళు మీ సంభాషణ రికార్డ్ చేస్తున్నారని అర్ధం.
- "లైఫ్ చాల చిన్నది, మన చేతిలొ ఉన్నప్పుడే అనుభవించాలి" ఇలాంటి పనికిరాని వేదాంతం చెప్పేవారిని అస్సలు నమ్మొద్దు..
- ఆఖరిగా.... ప్రలొభాలకు, ప్రసంశలకు లొంగిపొవద్దు.
ఇదంతా ఎదొ.. ఇప్పటికిప్పుడు అనుకుని రాసింది కాదు. చాలా రోజుల నుంచి గమనించిన విషాయలన్నీ ఒక చోట చేర్చి రాస్తున్నాను.


నేను చెప్పాలనుకున్న మాట ఒక్కటే... "అమ్మాయి!...........జాగ్రత్త!!"

9 comments:

  1. pardhu keka..
    meelo manchi fire undi.. meeku tvaralo oka manchi gift ishtanu..

    ReplyDelete
  2. pardhu .... Excellent నిజానికి కామెంట్ రాసే మూడ్ లో లేను కాని ఇది చదివాక ఉండలేకపోయాను. "అతడు" సినిమాలో మహేష్ బాబులా అదరగొట్టారు. త్వరలో ఇలా మాయలో పడేసే అమ్మాయిల గురించి కూడా రాస్తూ " అబ్బాయిలూ ..... జాగ్రత్త " శీర్శిక ఇస్తారని ఆశిస్తున్నాం. ఇన్నీ తెలిసీ మొసపోయే అమ్మాయిలు ఉన్నారు. ఏదయినా ఈ టపా చదివిన తర్వాత ఒక్క క్షణమైనా ఆలోచించగలిగితే టపాకి సార్థకత చేకూరినట్టే కదా .. Good luck.

    ReplyDelete
  3. good observations,

    great precautions

    nice post keep posting :)

    ReplyDelete
  4. బాగా రాసావ్ పార్ధూ...

    ReplyDelete
  5. చాలా చాలా బావుంది మీ టపా.
    విషయాన్ని చెప్పటమే కాక పరిష్కార మార్గాలు కూడా
    సూచించారు. మీరు ఇంకా ఇలాంటి పరిశొధనలు చేయాలని
    ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
  6. చాలా బాగా వ్రాశారు. మీ సలహాలను పాటిస్తే చాలా మంది బాగుపడతారు.హరేకృష్ణ.

    ReplyDelete
  7. బాగుందండీ వర్మ గారన్నట్లు అబ్బాయిలకి కూడా జాగ్రత్తలు చెప్తూ ఓ టపా వ్రాసేయండి.

    ReplyDelete
  8. nice pardhu chala baga rasavyu .....!

    ReplyDelete
  9. antha bane undi..
    basically ikkada only alanti abbailadi tappu ledu...
    ammailu kuda evarini padithe vallani trust cheyaddu..
    nannu adigithe easiest solution enti ante...
    tell everything and anything...relation modallayina gadinunchi share to someone close to you...your bro or mom or dad...
    they will help you if something goes wrong...honesty is the best policy




    and at prev comment...marella sudhakar..!!
    I am also marella :)

    ReplyDelete

మరి మీరేమంటారు?