ఆ సినిమా అయిపొయింది..

(ఆర్కుట్ లొ కవితలకి ఒక కమ్యునిటి చూసాను. ఎం కవితలు ఉన్నాయా అని చూస్తే సగం పైగా ప్రేమ లొ విఫలం అయిన వారివే కనపడ్డాయి. అప్పుడు వాళ్ళని ఉద్దేసించి ఎమన్నా రాయాలి అనిపించింది. అలా రాసిందే ఈ 'ఆ సినిమా అయిపొయింది)

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

గుండెకోత, నెత్తుటి మరక, చితికిన మనస్సు,
చిట్లిన ఫాళి,చెదిరిన కలలు, హృదయ సునామీలు..

చాలన్నా! చాలు!!

గుండెలొ కార్చిచ్చుకు ఆఙ్నం పొస్తూ..
ఏడబాటు అనే కాలాంతపు ప్రళయంలొ మునకలు వెస్తూ...

చాలన్నా! చాలు!!

తెలుసా..
నిన్న అది సంచలనం..
నేటికి వార్త..
రేపటికి బాబి గాడి చేతిలొ మిఠాయి పొట్లం.

శ్వాసించె ప్రాణవాయువు, స్పందించె అశ్రువు, నాడులలొ జీవాన్ని..
గతమనే కసాయికి బలి ఇస్తున్న ఓ త్యాగశీలి..
చూపులలొ చైతన్యం, వేళ్ళలొ నైపుణ్యం, పెదవుల సుమధుర ధరహాసాన్ని..
నిన్నటి కాష్టంలొ తగలబెడుతున్న ఓ మహా ఋషి..

చాలన్నా! చాలు!!

నిన్నటి నిద్ర నుంచి లేచి కళ్ళు చికిలించి చూడు..
కొత్తపుంతలు తొక్కుతూ నిన్ను తాకుతున్న ఆ లేత కిరణాలు చూడు..
విరహమనే వ్యసనంతొ నీలొ అణిచివెయబడ్డ, నీ సృజనాత్మకత కోసం యుగాలుగా వేచి చూస్తున్న ఆ ప్రకృతి కాంతని చూడు..

అవును
ఆ సినిమా అయిపొయింది..
అరికాలిలొ ముల్లు లాంటి ఆ గతం మనకొద్దు..
కళ్ళలొ సంద్రాలకి ఆనకట్ట కట్టి, చిరునవ్వుల సన్నజాజులు పూయించు

నిన్ను మరచిన కాలానికి చెప్పు "నే.. వస్తున్నా!!" అని..
నీ వెనుక గుసగుసలకి చెప్పు "ఖబడ్ధార్" అని..
లె!!.. ఓరలొ కత్తి లెదంటె సుత్తి
అయితే కలం కాకుంటే మనొఫలకం
ఆనాటి విన్యాసం మళ్ళీ రుచి చూపించు

నీ అడుగుల ప్రకంపనాలకి దిక్కులు ఉలిక్కిపడాలి
నీ తర్కానికి, విఙ్నానికి విజయలక్ష్మి దాసొహమనాలి
నీ వేగానికి సుడిగాలి నివ్వెరపొవలి

సత్ప్రవర్తన నీ తండ్రి, సత్కార్యం నీ తల్లి,
క్షతగాత్రుల పెదవులపై నవ్వులే నీ సొదరులు.

3 comments:

  1. కదం తొక్కే పదాలతో మంచి భావంతో చక్కని కవిత రాసారు.

    మీకు నా నెనర్లు.

    ReplyDelete
  2. hi

    very nice man,keep it up.

    Aditya

    ReplyDelete
  3. శ్రీకాంత్ గారు చెప్పినట్లు పదాలని కదం తొక్కించారు...చేతిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయంటే నమ్మండి!...

    ReplyDelete

మరి మీరేమంటారు?